26వ సర్గ : ఎడ్ల లక్ష్మి

కిష్కింధకు విచ్చేసి సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావింపుడు"అని మారుతి
 శ్రీరాముని అభ్యర్థించుట 




వాలి దహన సంస్కారాలు ముగిసిన పిమ్మట 
సుగ్రీవుడు ఇంకను దుఃఖము నుండి తేర్కొనలేదు 
అప్పుడు ముక్యులైన వానర సచివులందరు
ఆ వానర ప్రభువు చుట్టును చేరి ఓదార్చిరి 

సుగ్రీవాది వానరులందరు రాముని వద్దకు చేరిరి
వాయుసుతుడైన హనుమంతుడు 
శ్రీరామునకు నమస్కరించి ఇట్లు పలికెను 
ఓ రామా! కిష్కింద కార్యమును ముగింపుము

కిష్కింద నగరమునకు ప్రవేశించి 
సమస్త కార్యములను చేపట్టుము రామా! 
సుగ్రీవుని పట్టాభి శక్తుని గావింపుము 
వానరులకు సంతోషమును గూర్చుము

హనుమంతుడు పలికిన మాటలువిని 
శ్రీరాముడు ఆయనతో ఇట్లనెను
ఓ హనుమా! మా తండ్రి ఆజ్ఞానుసారము 
వనవాసదీక్ష ఉన్నప్పుడు ఏ పురమునకు రాకూడదు 

వీరుడు వానర శ్రేష్టుడైన సుగ్రీవుడు 
ఎన్నో సంపదలతో తులతూగుచు,
మనోహరముగా ఉన్న కిస్కిందకువెళ్ళి
వెంటనే రాజ్యాభిసిక్తుడగుగాక అనెను.
కామెంట్‌లు