శ్రీరాముడు పవిత్రమైన నగల వస్త్రమును తీసుకొనెను
అవి చూడగానే శ్రీరాముని కనులు నీటితో కప్పబడెను
హా ప్రియా! అని విలపించుచూ నేలపై పడిపోయెను.
శ్రీరాముడు నగలను తన హృదయానికి అతుక్కొని
గట్టిగా నిట్టూరుస్తూ మిగుల దుఃఖించుచుండెను
లక్ష్మణుడు గూడా శోకించుచుండెను
కాలు పట్టీలను చూచి ఆమెయే అని విలపించెను
లక్ష్మణా ఈ ఆభరాణములన్నియు వదినయే కదా!
అన్నా! ఈ అభరాణములు ఏవియు నేనెరుగను
నిత్యము వదినకు పాదాభివందనము చేయుట వలన
ఈ కాళీ అందేలు మాత్రము ఆమెయే అని నుడివెను
రఘునందనడు బాధతో సుగ్రీవునితో ఇట్లనెను
ఓ సుగ్రీవా! నా ప్రాణానికి ప్రాణమైన సీతాదేవిని
ఆ దుర్మార్గుడు అపహరించుకొని పోవుట నీవు చూచితివి
ఆమెను తీసుకొని అతడు ఏ దిశగా పోయినాడు
ఆ రాక్షసుడు సీతాదేవిని అపహరించి నా కోపానికి
కారకుడైనాడు అట్టివాడిని చంపకుండా వదిలిపెట్టను
నా సీతాదేవిని అపహరించుకొని పోయిన వాడు
ఏ దిశకు వెడలెనో నాకు తెలుపుము ఇప్పుడే వధించెదను.
=================================
కిష్కింధాకాండమందు 6వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి