కష్టం కష్టం చాలా కష్టం: - వచన కవిత : కలమట శ్రీనివాస్ రావు -విశాఖపట్నం -8074498772


 పెందిలకడనే లేవాలంటే కష్టం
చల్లని నీటితో ముఖాన్ని కడగాలంటే కష్టం
గోరు వెచ్చని నీటిని తాగాలంటే కష్టం
నడవాలంటే కష్టం పరుగెత్తాలంటే కష్టం 
చన్నీటి స్నానం కష్టం
ఉదయాన్నే ఆరోగ్యవంతమైన అల్పాహారం తినడం కష్టం
నోరూరుతుంటె కొంచెము తినడం... కష్టం!
తనువు కోరే సుఖాన్ని వదలడం... మరీ కష్టం!
కామెంట్‌లు