వింటున్నా... వింటున్నా. నీ స్వరమే వింటున్నా : - కలమట శ్రీనివాస్ రావు -విశాఖపట్నం -8074498772


వింటున్నా వింటున్నా... నీ స్వరమే వింటున్నా!
ఉదయపు వేళల కోడి కూతల మేలుకొలుపులు వింటున్నా,
కోయిల గానం, విహంగాల కిలకిలలు వింటున్నా.
అమ్మను పిలిచే లేగదూడల ఆకలి అరుపులు వింటున్నా,
ప్రేమతో నిదురను లేపే... అమ్మ పిలుపునే వింటున్నా

వింటున్నా వింటున్నా... నీ స్వరమే వింటున్నా
ఆకుల అలజడి, గాలి హోరుల సవ్వడి వింటున్నా
పిల్లల నోటి తియ్యని మాటల తేనెల వానలా వింటున్నా.
నాట్యం చేసే గజ్జెల స్వరాలనే వింటున్నా 
చేతి గాజుల గలగల వింటున్నా,
ప్రకృతి పలికే ప్రతిధ్వనిలో... 
హాయినిగొలిపే స్వరాలనెన్నో వింటున్నా.

కామెంట్‌లు