మనిషి స్ఫురద్రూపి!సౌందర్యాశ్రమవాసి!నిత్య కవితా సహవాసి!మధుర హృదయ నివాసి!దేవులపల్లి-బంగినపల్లి!కవితాభాస్కరుడు!భావకవితాచంద్రుడు!సున్నితభాషాసముద్రుడు!రసకవిత్వకళాప్రపూర్ణుడు!సరసపద పద్మభూషణుడు!కాలం శుక్ల, కృష్ణ పక్షం!కవిత్వమంతా మధురాక్షం!అందరూ ఆయన పక్షం!అదో, భావసౌందర్యగవాక్షం! మధురకవితలకల్పవృక్షం!అక్షరం సత్యం!పలుకు శివం !కులుకు సుందరం!పాట కావ్య గౌరవం!శ్రావ్యం ఆపాతమధురం!తెలుగు సరస్వతి,ఆ కలాన పుట్టే!కవితకు జుంటితేనెపట్టై,పట్టే!కవిత్వాన ఆల్కమీ,తెలిసిన గుట్టే!కట్టింది ఆవుపాల ,మీగడ తెట్టే!చదువురులంతా ,కలసి ఆయనకు పట్టం కట్టే!_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి