పాఠశాల పిల్లలకు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, విలువలతో కూడిన విద్యను అందించి, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దరమే లక్ష్యంగా పెట్టుకున్నాం, 'నేటి పిల్లలే రేపటి పెద్దలు' అనే నానుడిని సార్ధకం చేసే దిశగా కృషి చేస్తున్నాం. పాఠశాల పిల్లలకు రెగ్యులర్ చదువుతోపాటు ప్రత్యేకంగా ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పాఠశాలలో పగడ్బందీగా అమలు చేస్తున్నాం. వివిధ వినూత్న కార్యక్రమాల్లో పిల్లల్ని పాల్గొనేలా చేసి, వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రత్యేకమైన రోజుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, పిల్లలకు వివిధ విషయాలపట్ల అవగాహనను పెంపొందిస్తున్నాను. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రత్యక్షంగా చూసేలా క్షేత్ర పర్యటనలు విరివిగా చేపడుతూ వారికి విషయపరిజ్ఞానాన్ని అందిస్తున్నాం. పాఠశాలలో భౌతిక, మౌలిక అవసరాలను కల్పించడంతోపాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నాం. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల హక్కులు, బాధ్యతలను వారికి తెలియజేశాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి