వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయాలి – మంజుల పత్తిపాటి.


 ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ  డైరెక్టర్ మంజుల పత్తిపాటి పత్రికల వారితో మాట్లాడుతూ మాట్లాడుతూ.. రైతు దేశానికి వెన్నెముక అని, రైతు పండించిన పంటకు సరైన ధర లభించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు. రైతుల మార్కెటింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, మార్కెటింగ్ సంస్థలు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనేక వ్యవసాయ మార్కెట్ కమిటీలు పరిపాలనా, ఆర్థిక, మౌలిక సదుపాయాల పరంగా వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రభుత్వ సహకారంతో తగిన నిధులు కేటాయించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రైతుల భాగస్వామ్యంతో మార్కెట్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. తద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని మంజుల పత్తిపాటి అభిప్రాయపడ్డారు.
కామెంట్‌లు