సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -402: ఈ నెయ్యి చిందించకపోతే చుట్టాలు రారు
**
"ఏమో అవ్వా! కొంపల గా రేషను బియ్యం దప్ప ఇంగేం లెవ్వు. గీయన "శెప్తినడు వంట బుట్టదు". ఎన్ని త్యేపల శెప్పినా పోబడి మార్సుకోక పోతె ఎట్ల శెప్పవ్వా! "మా తాతలు నేతులు దాగిర్రు మా మూతులు వాసన సూడుర్రి "అన్నట్టుంటది ఆయిన యవ్వారం. ఇంటి గుట్టు బయిట వడకుండ సంసారం ఎల్ల దీత్తుంటే..కొంపల పరిత్తితి మన్సుకెక్కట్లే. నాకే సచ్చే సావొచ్చింది. పర్వు కోస్రం ఎవలికీ శెప్పుకోలేక సత్తున్న."
"ఏంది సోమిదమ్మొదినమ్మా! ఎన్నల్లేంది నా తానికి వొచ్చినవ్?గంత యిదైతున్నవు. నన్ను అక్కనో శెల్లెనో అన్కో.శిన్నప్పటాల్నించి సూత్తున్నవ్.ఇద్దరం నెత్తిన యిత్తులు ఏస్కొని గీడికి వొచ్చినం.గప్పన్నించి మన సోపతున్నా ఎన్నడైన కుశేలుని లెక్క నీ కట్టాలు శెప్పవైతివి. గియ్యాల బైటవడ్డవంటే ఎంత కట్టమొచ్చి వుండాలె.కిట్టయ్య అంతటి దాన్ని కాదు గని శిన్న శిన్న సాయం శెయ్య లేనా శెప్పు."
"అయ్యో అవ్వా! నీ మంచితనం నాకు తెల్వదా ఏంది? దినాం వొద్దన్నా శాయకి పాలు పంపిత్తున్నవ్.ఇంట్లె కాశినవి కాయగూరలని,ఆక్కూరలుని ఏవో పంపుతనే ఉంటవు."
 "దాందేముంది వొదినమ్మా! ఏదో ఉడ్త సాయం గంతే.గింతకి యిష్యం శెప్పకనే పోతివి.గంత శెప్పలేని రగస్సమైతే వొద్దు తీ! "
 "అయ్యో అవ్వా! గంత రగస్యం దాశేంత ఏవుందని. మా ఆయిన యవ్వారం నీకు తెల్వందేముంది.బాద్దెత తెల్వని మనిషి.ఉజ్జోగం సజ్జోగం లేదాయె.కూసోని తింటే కొండలు సుత కర్గుతయని,ఆత్తంత తలగబెట్టిండు.గిప్పుడు సూడు ఇల్లెల్లని తితి వొచ్చింది. నేనే తెల్శినోల్లిండ్లల్ల పిండొంటలు శెయ్యవోవుడు,పచ్చల్లు వెట్టుడు  శేబట్టి పొట్టకి బట్టకి ఎల్తున్నది. పని శెయ్యకపోతె మానె.ఒక్కాడ ఉండొచ్చు గద. ముందుగాల శెప్పకుండ సుట్టాలు పక్కాలల్ని భోజినాలకి రమ్మని పిలుత్తడు.ఎకాఎకీ శెప్తే నా పరిత్తితి ఎట్లుంటది శెప్పు."
 మా యిండ్లల్ల బోయినాలంటే ఉత్తగయితాది. పప్పు,పులుసు,పచ్చడో,తొక్కో,రొండు కూరలు, పెరుగో, సల్లనో వుండాలె.గంతేగాదవ్వా! గందుట్ల నెయ్యి చిందించకపోతే మరియాద తక్వ అయినట్టు మూతులు ముడుత్తరు.ఏమో అయితే వాయె తీ అన్కోవచ్చు గని సుట్టాలు పక్కాలల్ల మనల్ని తక్వ జేసి మాట్లాడ్తరు.గంద్కనే గిప్పుడు గింత రంది వడేది."
అయ్యో  వొదినమ్మా! గిప్పుడు నీకు ఏం గావాల్నో శెప్పు.గియ్యాల పొద్దుగాల్నే పాలకూర, తోటకూర, గోంగూర కోశుంచిన,గట్లనే తమాటీలు, బెండకాయలు,శిక్కుడు గాయలు సుత తెంపి పెట్టిన.అయ్యిన్ని అయ్యిన్ని మా భూలచ్మిని, బుడ్డోన్ని బల్లె నించి రాంగనే పంపిద్దమన్కుకున్న.  గీ సంచుల్ల బెట్టుంచిన".
"ఇగ్గో వొదినా! నెయ్యి కోస్రమే గద నీ రందంత.నిన్ననే ఎన్నకాశి డబ్బల్ల పోశిన పేటలున్న తమ్మునోళ్ళకి పంపదమని.మల్ల జేశి పంపుత గని గీ డబ్బ తీస్కవో.. వో యాది మర్శిన కందులు ఏయించి యిసుర్రాయిల యిస్రి పెట్టిన.ఏయించిన పప్పు ఎంత రుశిగుంటదో తెల్సుగద.ఇగ్గో యిందుట్ల వోసివెడ్తున్న."
"గియ్యన్ని ఒక్కదాన్వి ఎట్ల తీస్కవోతవు.నేను సుత ఇంటి దాక వొత్త."
"అవ్వా!  "నెయ్యి చిందించకపోతే చుట్టాలు రారు " గందుకే నీ తానికి వొచ్చిన. "ఆవలించకుండనే పేగులు లెక్క బెట్టుడన్న " శాత్రమేమొ గని నే నోటితోని శెప్పకుండనే ఇంటి పరిత్తితి అర్తం శేస్కున్నవ్.నీ ఋణం ఎట్ల తీరాలె?''
ఇగ్గో వొదినమ్మా! గట్ల కండ్ల నీళ్ళు దీయకు.మన్సు కలికలి అయితది. గిందుట్ల రుణమేముంది.నువ్వు నాకు పరాయి దానివా? అయినగని జల్మ - కర్మ అని మీరు ఏవేవో శాత్రాలు కతలు శెప్తరు గద. గట్లనే నేను ఎన్కటి జల్మల బాకీ వడి గిప్పుడిట్ల తీర్సుకుంటున్న అన్కోరాదు."
 "ఎంత పెద్ద మన్సు అవ్వా నీది."
"ఇగ్గో వొదినమ్మా! "ఈ నెయ్యి శిందించకవోతే సుట్టాలు రారని" ఎప్పుడూ బుగులు వడొద్దు.మనకి బర్రెలు ఆవులు వున్నయి.నీకు ఎప్పుడేం గావాలన్నా మొగమాట వడకు.నేనున్న గద. ఇంగ పా అన్న గా సుట్టపోల్లని తోల్కొచ్చే తల్కి నూ వొంట శెయ్యాలె గద."
గదండీ సంగతి! "ఈ నెయ్యి చిందించకపోతే చుట్టాలు రారు " శాత్రం ఎన్కటి సంది మరియాదల ఓ బాగం. సుట్టాలొత్తె నెయ్యేసి బోయినం వెట్టాల్సిందే."
కామెంట్‌లు