మార్కులు కాదు.. జీవితంలో మార్పు కోసం చదవండి!: వెంకట్ , మొలక ప్రతినిధి
 విద్యార్థులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్. జనార్ధన్


సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల @ తోల్కట్ట నిర్వహించిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎన్. జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఆడపిల్లల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, "ఆడపిల్ల చదువుకుంటే ఒక తరం బాగుపడుతుంది" అని అన్నారు. ప్రతి విద్యార్థి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డిజిటల్ వనరులను సద్వినియోగం చేసుకుంటూ నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలని, కాలానుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. సమాజానికి అవసరమైన మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు మంచి పాటలతో విద్యార్థులను అలరించారు
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్, సీనియర్ జర్నలిస్టు, మోటివేషనల్ స్పీకర్ KVM వెంకట్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. "మార్కుల కోసం కాదు.. జీవితంలో మార్పు కోసం చదవండి" అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎన్ని డిగ్రీలు సంపాదించినా వాటితో పాటు నైపుణ్యాలు (Skills) ఎంతో ముఖ్యమని, నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలంటే మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి అవసరమని తెలిపారు.
స్వామి వివేకానంద చెప్పినట్లు "బలమే జీవనం.. బలహీనతే మరణం" అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. నేటి యువత చెడు వ్యసనాలకు, తప్పుడు మార్గాలకు దూరంగా ఉండాలని, అర్ధాంతరంగా జీవితాలను ముగించుకోకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు.
ఈ భూమిపై కేవలం పుట్టి గిట్టిపోవడానికి మాత్రమే మనం రాలేదని, మనం జీవించిన సమాజానికి ఎంతో కొంత మంచి చేసి వెళ్లాలని చెప్పారు. మనుషులు మారాలని, మానవత్వాన్ని పంచాలని, ఇతరులకు సహాయం చేసినప్పుడే నిజమైన మానవత్వానికి అర్థం ఉంటుందని వివరించారు.
జీవితంలో ఎప్పటికీ అమ్మానాన్నలను, అత్తమామలను, అక్షరాలు నేర్పిన గురువులను, ఆకలి విలువను, అన్నం విలువను మరచిపోకూడదని హితవు పలికారు.
"ఎదగడానికి సమాజం కావాలి.. ఎదిగిన తర్వాత సమాజానికి మీరు కావాలి. సమాజం మీ కోసం ఎదురుచూసే స్థాయికి ఎదగాలి" అని విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరూ తమను తాము మలుచుకోవాలని, తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలని సూచిస్తూ.. పుస్తకం ఎల్లప్పుడూ హస్తభూషణంగా ఉండాలని, దేవాలయంలో గడిపే సమయం కంటే గ్రంథాలయంలో ఎక్కువ సమయం గడిపి విజ్ఞానాన్ని సంపాదించాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కోట విజయ మాట్లాడుతూ.. విద్యార్థులకు నిరంతరం నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ, వారి భవిష్యత్తుకు సరైన మార్గదర్శనం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కోట విజయ  వైస్ ప్రిన్సిపల్, లైబ్రేరియన్ శిల్పా దేశ్పాండే, ఉపన్యాసకులు,
కామర్స్ విభాగం
డాక్టర్ హలీమున్నీసా
డాక్టర్ మానస
డాక్టర్ అర్పిత
డాక్టర్ నేహా తుంక్
డాక్టర్ అందాలు
కెమిస్ట్రీ విభాగం
డాక్టర్ జి. సబిత
డాక్టర్ జి. నాగలత
వృక్షశాస్త్ర విభాగం
డాక్టర్ దీపిక
జంతుశాస్త్ర విభాగం
శ్రీమతి పి. భవాని
గణిత శాస్త్ర విభాగం
డాక్టర్ ఎం. మౌనిక
డాక్టర్ ప్రపూర్ణ
ఆర్థిక శాస్త్ర విభాగం
శ్రీమతి పి. మౌనిక
రాజకీయ శాస్త్ర విభాగం
శ్రీమతి షహానా బేగం
చరిత్ర విభాగం
శ్రీమతి శృతి
గణాంక శాస్త్ర విభాగం
శ్రీమతి పి. మౌనిక
కంప్యూటర్ శాస్త్ర విభాగం
శ్రీమతి శ్వేత
భౌతిక శాస్త్ర విభాగం
డాక్టర్ స్వాతి
గ్రంథాలయ అధికారి
శ్రీమతి శిల్పా దేశ్‌పాండే
వ్యాయామ విద్యా సంచాలకురాలు
శ్రీమతి రవీనా
విద్యార్థులు పాల్గొన్నారు
కామెంట్‌లు