సుప్రభాత కవిత ; - బృంద


కనుల నీ లి నీడలు 
కలల దీపం చెరిపేస్తే...
కలత మబ్బుల చీకటి 
తొలి కిరణం తీర్చదా!

పొగ మంచు తెరలు 
సెగ తగిలితే కరిగినట్టు 
వేధించే బాధలను 
వెలుతురు తగ్గించదా!

కన్నీట మసక బారిన చూపు 
చెక్కిళ్ల జారాక తిరిగిరాదా?
గొంతులో ఆగిన దుఃఖం 
గుండెలోకి జారిపోదా?

కాలం చేసిన గాయాన్ని 
మాయం చేసేది మరుపే కాదా!
గాలానికి చిక్కిన  చేపకు 
జాలమే లోకం అయిపోదా!

మేలుకున్న బ్రతుకున 
వేడుకలు నింపేది 
వేయి ఆశలు రేపేది 
వేకువ ఒక్కటే కాదా!

ఆశ జీవన సూత్రము 
ఓర్పు జీవనధ్యేయము 
రేపన్నది జీవన ఆధారము 
మార్పు కోసం వేచే మదికి 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Nice mam 👌👌