బాల్యంలో చదువుతోపాటు సంస్కారం
ఆటపాటలతో నేర్చుకుని
అమ్మానాన్నల అనురాగ ఆప్యాయతలతో
పాఠశాలలో గురువు చెప్పిన మాటలు విని
ఆచరించిన బాలలు
సమాజ అభివృద్ధి కారుకులు .
తగు రీతిని చిన్న మొక్కను పెంచితే
పెరిగి పెద్దయి బాటసారిలకు
నీడనిచ్చే వటవక్షంగా మారును
బాల్యంలో యుక్తాయుక్త విచక్షణ నేర్చుకు
మానవత్వమే మాధవత్వమని
అదే పరమాత్మ తత్వమని
మంచి పౌరులుగా మారే
బాలలు భవిష్యత్తు బంగరు మయం
వారు వసుదైకానికే ఆదర్శం..!!
.............................
....................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి