ఆశ్వమేధికపర్వము: - అచ్యుతునిరాజ్యశ్రీ


 భీష్మ నిర్యాణానంతరం పాండవులంతా డీలాపడ్డారు.కృష్ణుడు ఓదార్చాడు"చనిపోయినవారికోసం శోకం తగదు.రకరకాల యజ్ఞాలుచేసిపితరులను తృప్తిపరుచు.ధర్మ రాజా! నీవు మూఢునిలా శోకించుట తగదు.రాజ్యభారం వహించు"."కృష్ణా! అందరినీ చంపిన పాపం నాకు శాపంగా మారదా?" అందుకు వ్యాసుడిలా అన్నాడు" ధర్మజా! నీవు బాలునిలా అజ్ఞానంలో ఉన్నావు. అశ్వమేధయాగం చేయి." "అయ్యో! నాదగ్గర  ధనం లేదు దానం చేయాలంటే! ఇతరులను యాచించలేను. " అప్పుడు వ్యాసుడు మరుత్తునివృత్తాంతం చెప్పాడు. మరుత్తుడనేరాజు సువర్ణ దానం చేస్తే ఆబ్రాహ్మణులు మోయలేక హిమాలయంపైవదిలారు.దాన్ని తెప్పించి యజ్ఞంచెయ్యి అనిసలహా ఇస్తే  ధర్మరాజు ఆయనవివరాలు అడిగితెల్సుకుంటాడు🌹
కామెంట్‌లు