జిల్లాగా మారిన తర్వాతే అది ఖిల్లాగా మారింది.
నల్లమల అరణ్యాలు
దుందుభి సముద్రాలు
కొల్లాపూర్ కోటలు
కల్వకుర్తి కాలువలు
నాగర్ కర్నూల్ చెరువులు
సోమశిల సోయగాలు
అదో పచ్చని ఆకాశం
అదో పచ్చని మైదానం
అదో పచ్చని ధనం....
ఉమామహేశ్వరం మరో శ్రీశైలం
పాలెం మరో తిరుపతి
జటప్రోలు మరో దేవదాయ సమూహం.
జగమెరిగిన బ్రాహ్మణునికి జన్దేమేల
మా జిల్లాకు పరిచయమేలా.........!!
ఎస్పీ ఆఫీసు అదో మాస్టర్ పీస్
కలెక్టరేట్ మరో తాజ్ మహల్
విద్యాసంస్థలు మా ఆస్తులు
మెడికల్ కాలేజీ మా మెడలో ముత్యాల హారం
పరిశోధనా సంస్థ మాకు వ్యవసాయం
వ్యవసాయ కళాశాల మాకు సహాయం
పైరులు మాకు సిరులు
వనాలు మాకు వనరులు.
జాతీయ రహదారులు మాకు దారులు
రవాణా వ్యవస్థ మాకు గొప్ప వరం.
విద్యావ్యవస్థ ఆరోగ్య సంస్థలు
మొకు ప్రత్యేకం
మానవ వనరులు పల్లెలు
మా సర్వస్వం
తెలంగాణ తర్వాతే తేరుకున్న మా జిల్లా
జిల్లాగా మారిన తర్వాతే అది ఖిల్లాగా మారింది.
=====================================
నాగర్ కర్నూల్ జిల్లా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.
=======================================
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి