భావోద్వేగాల నిలయం!: - పాలగుమ్మి జ్యోతి.


నాలుగు గదుల ఇల్లు! నవరసాలకు పుట్టిల్లు! 

వ్యధలన్నీ  గదిలో బంధించేసేయ్!
కలలన్నీ బంధించి తలుపేసేయ్!

మధురమైన భావాలు! ముల్లులా గుచ్చే మాటలు! 
ప్రేమానురాగాలు అసూయాద్వేషాలు! 

ఆనందపు అలలపై తేలియాడు నౌకలా...
చిలిపి తలపులతో ఊగుతున్న లతలా... 
వేదన దాచిన జ్వాలాముఖిలా...
మమతల కుసుమాలతో నిండిన భూరుహములా.. 

ప్రతి మనిషిలో దాగిన ఇల్లు!
భూకంపాలకు చెదరని ఇల్లు!
తుఫానులు వచ్చినా మునగని ఇల్లు!
సున్నితమైన అద్దాల గోడల ఇల్లు! 
హృదయమనే నాలుగు గదుల ఇల్లు!
కామెంట్‌లు