ఏ పని చేయాలన్నా శరీర సహకారం ఉండాలి
తిండి కలిగితే కండ కలదోయి
కండ కలిగిన వాడే మనిషోయి అన్నాడు గురజాడ .
ఆరోగ్య శరీరానికి ఆహారాన్ని చేకూర్చే రైతన్న
మన కడుపు నింపే ప్రాణప్రదాత
మట్టిని నమ్ముకుని మట్టిలోనే పెరిగి
మట్టిని మాణిక్యంగా చూసి మురిసే
మట్టి మనిషి రైతన్న .
దేశానికి వెన్నుముక .
ఏరువాక పండుగతో హలం పట్టి పొలం దున్ని విత్తుజల్లి
భవిష్యత్తు బంగరమయం కావాలని
పగలనక రేయనక
నిరంతరం శ్రమించే రైతన్న
పరమాత్మని ఆనతితో పుడమి పై జన్మించి
పుడమి నే నమ్ముకుని
జీవితాంతం మట్టితోనే సహజీవనం చేసి
అందరికీ కడుపు నింపి ఆనందించే ఓ రైతన్న
నేడు దళారీల బారిన పడి
పండిన పంటకు గిట్టుబాటు రాక ఒక వైపు
మానవ తప్పిదాలకు ప్రకృతి వైపరీత్యాలైన
ఎలెనినో తో భూతాపంతో బీడులు వారి పంట పండక
వరదలు ఉప్పెనలతో
చేతికందిన పంట నాశనమై
అందరికీ కడుపు నింపే ర అర్ధాకలితో
జీవితాన్ని గడిపే రైతన్న.
యుక్తా యుక్త విచక్షణ కలిగిన మనుషులంతా
పర్యావరణ పరిరక్షణ చేసిన
మనుగడకు ఆధారమైన
మట్టి మనిషి భవిష్యత్తు బంగరు మయమగును.!
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి