సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘విశ్వహిత శతకం’ పుస్తకావిష్కరణ
 

రాజన్న సిరిసిల్లలో సాహితీ రంగంలో తనదైన రచనా ప్రతిభతో ముందుకు సాగుతున్న కవి వెంగళ లక్ష్మణ్ రచించిన ‘విశ్వహిత శతకం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలోని సినారె జిల్లా గ్రంథాలయంలో సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన వెంగల లక్ష్మణ్ కార్య నిర్వహణలో ఘనంగా నిర్వహించారు. తన రచనల ద్వారా సాహిత్యాభిమానులకు మరింత చేరువవుతున్న వెంగళ లక్ష్మణ్, ‘విశ్వహిత శతకం’తో సాహితీ ప్రపంచానికి మరో రచనను అందించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ గారు మాట్లాడుతూ వెంగల లక్ష్మణ్ శతకంలో తెలంగాణ భాష యాసకు ప్రాణం పోశారు. తెలుగు భాషకు జీవం అందిస్తుందన్నారు. అలాగే అన్ని మతాలను ఏకం చేసి మానవత్వాన్ని చాటుకున్నదన్నారు. విశ్వహితం కోసం రచించినట్టుగా తెలంగాణ పలుకు బడుగులు ఉన్నాయన్నారు.పలువురు సాహితీవేత్తలు ఆయన రచనా కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, నేటి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,తోట ఆగయ్య,కోడం నారాయణ,, కార్యదర్శి బుగ్గ రాజేశ్వర్, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత నలిమేళ భాస్కర్, సీనియర్ సిటిజన్ నాయకులు చేపూరి బుచ్చయ్య, ఏనుగు ఎల్లయ్య, దొంత దేవదాసు పాల్గొన్నారు.
అలాగే ప్రముఖ కవులు, రచయితలు జూకంటి జగన్నాథం, రాచర్ల రఘురామ శర్మ శతకాన్ని సమీక్షించారు., జోగినిపల్లి మోహనరావు ఆర్థిక సహాయం అందించి దాతగా నిలిచారు, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్ గౌడ రాజు ఏనుగుల ఎల్లన్న, సాహితీవేత్తలు సబ్బని లక్ష్మీనారాయణ సంకేపల్లి నాగేంద్ర శర్మ పాల్గొన్నారు. మాదాసు బలరాం విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు. విశ్రాంత ఉద్యోగుల  సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు. బుర్కా గోపాల్ గడ్డం పరశురాములు, గూడూరి బాలరాజు, సబ్బానీ లక్ష్మీనారాయణ, నేరోజు రమేష్, వాసరవేణి పరశురాములు, ఆడెపు లక్ష్మణ్, సాయి మహేష్, శోభారాణి, అంకారపు రవి, మొతుకుల నారాయణ, వంశీ, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత వెంగళ లక్ష్మణ్‌కు అభినందనలు తెలియజేస్తూ ఆయన సాహితీ ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కామెంట్‌లు