పరమేశ్వరుడు సర్వాంతర్యామి ఇందు గలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు హిరణ్యకశపుని తో చెప్పాడని పోతన భారతంలో చెప్పాడు. ప్రధానంగా నేటి సమాజంలో' ధర్మో రక్షతి రక్షితః' అన్నది ప్రధానంగా ఎందరో మహనీయులు పీఠాధిపతులు సన్యాసులు స్వామీజీలు ప్రవచన కర్తలు అందరు పుట్టలోను, చెట్టులోను ప్రతి జీవిలోను పరమేశ్వరుడు ఉన్నాడని చెబుతున్నారు
మానవత్వమే మాధవత్వమని అదే పరమాత్మతత్వమన్న విషయం తెలిసిందే అని ఆనాటి ఆదిశంకరులు నుంచి నేటి వరకు ప్రతివారు చెప్పినది విదితమే.
స్వార్థ ,సంకుచిత స్వభావంతో మతమార్పిడులకు లోనవుతున్న నేటి పరిస్థితులలో అన్నీ తెలిసిన ప్రజాదరణ కలిగిన స్వామీజీయే శివ అనే శబ్దాన్ని అంగీకరించకపోవడం కేశవునే ఆరాధించడం గొప్పవాడని చెప్పడం మరియు రావణాసురుని సంహరించిన అనంతరం రామేశ్వరంలో లింగ ప్రతిష్ట చేయలేదని ఆది శంకరులనే విమర్శించడం ఏమిటి వింత పరిస్థితి ?ఇప్పటికే మతమార్పిడులు ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రజలను మంచి మార్గంలో నడిపించవలసిన వారే రామేశ్వరంలో సీతమ్మ లింగ ప్రతిష్ట చేయలేదని చెప్పడం అలాగే శివ పదమే కాక శివ కుటుంబం గురించి వ్యతిరేక ధోరణిలో ప్రవర్తించడం సరి అయినదా
మన సనాతన ధర్మంలో నిత్య క్రతువు సంధ్యావందనంలో కూడా అదే గాయత్రి మంత్రం ఉపాసనలో
'శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు:
విష్ణోస్యహృదయం శివః'
అన్నది ఆచరిస్తామే
అలాగే విష్ణు సహస్రనామంలో
శివుడు పార్వతికి శ్రీరామ తారక మంత్రం
'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే' అని చెప్పారే
దీన్ని బట్టి శివకేశువులకు ఆభేదం లేదు అని తెలుస్తున్నది మరి శివుడే గొప్ప విష్ణువే గొప్ప అని ఎక్కడ చెప్పబడలేదు ఇప్పుడున్న విపత్కర పరిస్థితిలో పీఠాధిపతులు స్వామీజీలు ప్రవచనకర్తలు ధర్మ ప్రబోధకులు అందరు ఏకత్రాటిపై నిలిచి ధర్మ పరిరక్షణ చేయాలి . సమాజ కల్యాణానికి దోహదపడాలి..!!
పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్పూర్ణ ముదత్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణ మేవ వశిష్యతే..!!
............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి