నెల్లూరులో సోమన్న వింజామర పుస్తకావిష్కరణ
 

నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 111వ పుస్తకం "వింజామర" తో పాటు ఏడు పుస్తకాల ఆవిష్కరణ టౌన్ హాల్, నెల్లూరులో ఘనంగా జరిగాయి.కవి చిల్లకూరు ఆదినారాయణరెడ్డి మరియు చిల్లకూరు వెంకురెడ్డి గారుల ఆధ్వర్యంలో,కీ. శే. శ్రీ చిల్లకూరు బాలకృష్ణారెడ్డి, కీ. శే. శ్రీమతి చిల్లకూరు కమలమ్మ గారుల జ్ఞాపకార్ధం,పెన్నా రచయితల సంఘం,నెల్లూరు వారి సౌజన్యంలో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డా. గంగిశెట్టి శివకుమార్,కళారత్న శ్రీ చిన్ని నారాయణ, శ్రీవల్లూరు మనోహర్ రెడ్డి, శ్రీ దయాకర్ రెడ్డి, శ్రీ చిల్లకూరు వెంకురెడ్డి, శ్రీ యన్. వి. రమణారెడ్డి, డా. పాతూరి అన్నపూర్ణ,శ్రీ వన్నం బ్రహ్మయ్య మరియు డా.కొండూరు హరినారాయణరెడ్డి  గారుల చేతుల మీదుగా శ్రీ గద్వాల సోమన్న ఎనిమిది పుస్తకాల ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం ఈ పుస్తకాల్లో రెండు అమ్మ ప్రేమ, పున్నమి వెన్నెల చిల్లకూరు ఆదినారాయణ రెడ్డి గారికి అంకితమిచ్చారు. అమ్మ ప్రేమ పుస్తక సమీక్ష శ్రీమతి సుభద్ర దేవి, పున్నమి వెన్నెలపుస్తక సమీక్ష శ్రీ శివకృష్ణ ప్రసాద్ గారులు చేశారు.పిదప శతాధిక గ్రంథకర్త సోమన్నను సత్కరించారు.ఈ కార్యక్రమంలో అవ్వారు శ్రీధర్ బాబు, కుని అంకబాబు,.. పాల్గొన్నారు. బాలగేయ బ్రహ్మ సోమన్నను తోటిఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు, సాహితీ మిత్రులు  అభినందించారు.
కామెంట్‌లు