విశ్వమంతా కాంతిని విరజిమ్ముతుంది!
భయాల తెరలను తొలగిస్తుంది —
బతుకుకు భరోసానిచ్చి ముందుకు నడిపిస్తుంది!
వెలుగు దిగులును మాయంచేస్తుంది —
దివ్యమైన చిరునవ్వును పూయిస్తుంది!
నిరాశా నిశీధిని పారద్రోలుతుంది —
నిండు ఆశల ఉదయాన్ని చూపిస్తుంది!
వెలుగు లోకాన్ని పరిచయం చేస్తుంది —
వింతవింత వర్ణాలను ఆవిష్కరిస్తుంది!
వినూత్న ఆలోచనలను రేకెత్తిస్తుంది —
విజ్ఞానపు ద్వారాలను తెరిపిస్తుంది!
వెలుగు అజ్ఞానాన్ని అంతం చేస్తుంది —
అంతరంగంలోని చైతన్యాన్ని మేల్కొలుపుతుంది!
అక్షరాల అంతరార్థాన్ని ఆవిష్కరిస్తుంది —
అనుభవాల అమృతాన్ని అందిస్తుంది!
వెలుగు గమ్యాన్ని దర్శింపజేస్తుంది —
లక్ష్యాన్ని చేరే మార్గాన్ని చూపిస్తుంది!
అడుగడుగునా ఆత్మవిశ్వాసాన్నిస్తుంది —
అవరోధాలను అధిగమించే శక్తినిస్తుంది!
వెలుగు విజ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది —
వివేకపు వాకిళ్లను తెరుస్తుంది!
వెలుగు ఉన్నచోట వికాసం విరబూస్తుంది —
వెలుగు లేని చోట అజ్ఞానం తాండవిస్తుంది!
వెలుగు ఒక దీపం — చీకటికి శాపం!
వెలుగు ఒక జ్ఞానం — జీవితానికి ప్రాణం!
వెలుగు ఒక మార్గం — విజయానికి సోపానం!
వెలుగు ఒక ప్రేరణం — ప్రగతికి కారణం!
వెలుగును పంచుదాం — చీకటిని పారదోలుదాం!
జ్ఞానజ్యోతులు వెలిగిద్దాం — జగతికి దారిచూపుదాం!
మనలోని చైతన్యాన్ని మేల్కొలుపుదాం —
మానవతా మందిరంలో మహోదయాన్ని ఆవిష్కరిద్దాం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి