జపనీయులు భారతీయులను తమ ఇళ్లకు సాధారణంగా ఎందుకు ఆహ్వానించరు?: - - యామిజాల జగదీశ్


 ఒక భారతీయుడు ఏడాదికి పైగా జపాన్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడొక విషయం అతనికి ఆశ్చర్యం కలిగించింది.
జపాన్‌లోని అతడి స్నేహితులు ఎంతో మర్యాదగా ఉండేవారు. అవసరమైన ప్పుడు సహాయం చేసేవారుకూడా. ఆప్యాయంగా మాట్లాడేవారు. కానీ వారిలో ఒక్కరు కూడా అతనిని తమ ఇంటికి ఆహ్వానించలేదు. కనీసం ఒక కప్పు టీ తాగడానికి కూడా పిలవలేదు.
దీంతో కొంత బాధగా, అయోమయం గా అనిపించిన అతడు చివరకు ఒక జపాన్ స్నేహితుడిని నేరుగా అడిగేశాడు.
చాలాసేపు మౌనంగా ఉన్న ఆ స్నేహితుడు ఇలా చెప్పాడు.
"మాకు భారతదేశ చరిత్రను పాఠాలుగా చెబుతారు. స్ఫూర్తి పొందడానికి కాదు... ఒక హెచ్చరికగా!"
ఆ మాటలకు ఆశ్చర్యపోయిన భారతీయుడు, "హెచ్చరికగానా? భారతదేశ చరిత్రను హెచ్చరికగా చెబుతారా? ఎందుకో కాస్త వివరంగా చెప్పగలవా?" అని అడిగాడు.
అప్పుడు ఆ జపాన్ స్నేహితుడు ఇలా ప్రశ్నించాడు.
"బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని పాలించినప్పుడు వారి సంఖ్య ఎంత?"
"బహుశా పదివేల మంది ఉండొచ్చు" అని భారతీయుడు సమాధానమి చ్చాడు.
"అప్పుడు భారతదేశ జనాభా 30 కోట్లకుపైనే కదా?" అని జపాన్ స్నేహితుడు అడిగాడు.
"మరి మీ ప్రజలపై జరిగిన దారుణాలకు ఆదేశాలిచ్చింది ఎవరు? వారిని కొట్టింది, చిత్రహింసలు పెట్టింది, కాల్చి చంపింది ఎవరు? ఆ ఆదేశాలను అమలు చేసింది ఎవరు?"
"జలియన్‌వాలాబాగ్‌లో జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించినప్పుడు తుపాకులు పేల్చింది బ్రిటిష్ సైనికులా? కాదు... భారతీయ సైనికులే కదా!"
"జనరల్ డయ్యర్‌ను ఎదిరించి ఒక్కరైనా తుపాకీ ఎత్తలేదా?" అని ప్రశ్నించాడు.
"మీరు చెప్పుకునే బానిసత్వం కేవలం శరీరానికి సంబంధించినది కాదు. అది మనసుకు, ఆత్మగౌరవానికి సంబంధిం చిన బానిసత్వం" అని అన్నాడు.
ఆ మాటలు విన్న భారతీయుడు నిశ్శబ్దంగా తలదించుకుని నిలబడ్డాడు.
ఆ జపాన్ స్నేహితుడు మళ్లీ ఇలా చెప్పసాగాడు.
"మధ్య ఆసియా నుంచి భారతదేశా నికి వచ్చిన మొఘలుల సంఖ్య ఎంత? బహుశా కొన్ని వేల మంది మాత్రమే ఉండొచ్చు. అయినా వారు ఎన్నో శతాబ్దాల పాటు ఇక్కడ ఎలా పాలించగలిగారు?"
"వారు తమ సంఖ్యాబలంతో భారతదేశాన్ని పాలించలేదు. వారికి సహకరించినవారు, వారి ఆజ్ఞలను పాటించినవారు, తమవారినే వెన్నుపోటు పొడిచినవారు కూడా మీ దేశంలోనే ఉన్నారు. కొందరు ప్రాణాల కోసం, మరికొందరు పదవుల కోసం, ఇంకొందరు ధనం కోసం వారికి అండగా నిలిచారు."
"మీ ప్రజల్లో కొందరు మతాలు మార్చుకున్నారు. కొందరు తమ కుటుంబాల విషయంలో కూడా పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గారు."
"మీ దేశ వీరులను విదేశీ పాలకులకు పట్టించినవారు కూడా మీవారిలోనే ఉన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడ దాక్కున్నారో బ్రిటిష్ వాళ్లకు సమా చారం ఇచ్చింది ఎవరు? ఆ సమా చారంతోనే ఆయనను చుట్టు ముట్టారు కదా!"
"భగత్‌సింగ్ వంటి దేశభక్తులకు ఉరిశిక్ష పడిన సందర్భంలో కూడా అప్పటి నాయకత్వం పాత్రపై ఎన్నో ప్రశ్నలు, విమర్శలు ఉన్నాయి."
"భారతీయులారా! మీకు విదేశీ శత్రువులే అవసరం లేదు. అధికారం, పదవి, స్వార్థం కోసం మీలో కొందరే తమ దేశ ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. అందుకే మేము భారతీయులకు దూరంగా ఉంటున్నాం."
"బ్రిటిష్ వాళ్లు హాంకాంగ్, సింగపూర్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానికులు వారి సైన్యంలో చేరలేదని అంటారు. కానీ భారతదేశంలో మాత్రం చాలామంది బ్రిటిష్ సైన్యంలో చేరి, వారి పాలనకు సేవ చేశారు. చివరికి తమ దేశ ప్రజలపైనే ఆయుధాలు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి."
"ఇప్పటికీ పరిస్థితి మారలేదని నాకు అనిపిస్తుంది. చరిత్ర నుంచి మీరు పాఠాలు నేర్చుకోవడం లేదు. ఉచిత విద్యుత్, ఒక మద్యం సీసా, ఒక దుప్పటి లాంటి చిన్న ప్రయోజనాల కోసం కూడా మీ ఓటును, ఆత్మ గౌరవాన్ని, మనస్సాక్షిని అమ్ముకుంటున్నారు."
"పెద్ద పెద్ద నినాదాలు చేస్తారు. నిరసనలు తెలుపుతారు. కానీ దేశం కోసం ఏదైనా త్యాగం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతారు. మీకు మొదట గుర్తొచ్చేది మీ ఇల్లు, కుటుంబం, భార్యాపిల్లలు, ఆస్తిపాస్తులే. దేశం, ధర్మం గురించి ఆ తర్వాతే ఆలోచిస్తారు."
ఇలా చెప్పి ఆ జపాన్ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ భారతీయుడు మాత్రం తలదించు కుని అక్కడే నిలబడిపోయాడు. ఆ మాటలు అతడిని ఆలోచనలో పడే శాయి.
**మనమూ భారతీయులమే కదా!**
**ఒక్కసారి ఆలోచించండి... మన చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి?**
దేశభక్తి అంటే కేవలం నినాదాలు చేయడం కాదు. స్వార్థం పక్కన పెట్టి, నిజాయితీగా మన బాధ్యతలు నిర్వర్తించడం కూడా దేశభక్తే! కదా అనుకున్నాడు మనసులో.
గమనిక : ఇందులో జపనీయుల అభిప్రాయాలు, భారత చరిత్రకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు నిర్ధారిత చారిత్రక వాస్తవాలుగా భావించకూడదు.
కామెంట్‌లు