అమ్మమ్మ తాతయ్య మన సెయింట్ లూయిస్ పట్టణానికి దగ్గరగా గంట దూరంలో విశాఖపట్నంలోని బొర్రా గుహలు లాంటివి ఉన్నాయి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాను అన్నాడు మనుమడు ప్రదీప్. మన మిస్సోరి రాష్ట్రంలో స్టా0టన్ దగ్గర ఓజార్క్స్ ప్రాంతంలో ఉన్నాయి అక్కడ లాగే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం సున్నపురాయి గుహలే 4.6 మైళ్ళ పొడవున అతి సుందరమైన గుహలు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చి సందర్శిస్తారు వాతావరణం బాగుంది చక్కటి వృక్షాల మధ్య మెరమిక్ నది మీద సహజ సిద్ధంగా ఏర్పడినవి నేను జాగ్రత్తగా దగ్గరుండి తీసుకెళ్తాను గుళ్ళు గోపురాలు చూడటం అయిపోయింది ఇండియా వెళ్ళేముందు రక రకాల రంగులు కలిగినవృక్షాలు విభిన్న పక్షుల ధ్వనులు విందాం అన్నాడు ప్రదీప్
షరా మామూలే మా ఆవిడ ఓపిక లేదు అనకండి మనుమడు కుటుంబం దగ్గరుంటారు వెళదాం అంటే ఎప్పుడు నీ మాట కాదన్నాను అన్నాను .
. ఉదయం భోజనం పది గంటలకే చేసి మనుమడు కొన్న టెస్లా కారులో మంచి నీళ్ళు పట్టుకు అరటిపళ్ళు ఆపిల్స్ తీసుకుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తు ఒరే ప్రదీప్ ఎంత బాగున్నాయి రంగు రంగుల ఆకులతో చెట్లు పక్షులు అన్న అమ్మమ్మతో ఇది ఫాల్ సీజన్ అందుకే ఇప్పుడు వెళదామన్నాను అన్నాడు
గైడ్ సహాయంతో లోపల గుహల చరిత్ర మనుమడు ఇవి పురాతన కాలంలో స్థానిక ఆశ్రయంగా ఉపయోగించుకోవడం తరువాత 18 వ శతాబ్దంలో అమెరిన్ అంతర్యుద్ధం సమయంలో తుపాకీ తయారీకి అవసరమైన సాల్ట్ పీటర్ వెలికితీతకు ఉపయోగించడం
అలాగే అమెరికా ప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ 'జెస్సీ జేమ్స్' అతని దొంగల ముఠా స్థావరంగా చెప్పి ప్రకృతి సహజ సిద్ధమైన ప్రపంచ ప్రసిద్ధ వైన్ టేబుల్ అనే రాతి నిర్మాణం నీటి అడుగున ఏర్పడిన అరుదైన ' అరగోనైట్' నిర్మాణం .ఇక మిర్రర్ రూమ్ గుహ పైకప్పును అద్భుతంగా అద్దంలా చూపే నీటి ప్రవాహం
ఒక చోట 58 మెట్లు ఎక్కి సున్నపు రాయితో ( స్టాలగ్మైట్స్ )ఏర్పడిన అందమైన ఆకృతులు చివరగా గుహలోని భారీ రాతి గోడలపై " గ్రేటెస్ట్ షో అండర్ ది ఎర్త్" అనే ప్రత్యేక మైన లైటింగ్ మరియు మ్యూజిక్ షో ప్రదర్శన చాలా అద్భుతం.
తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ తాతయ్య మీకు ఫోటో తీస్తానని ఎలా ఉంది అంటే ఒరే ప్రదీప్ ఎంత బాగుందో ముఖ్యంగా ఆ పరమాత్ముడు ప్రసాదించిన ఆకృతులు లైట్ షో చాలా బాగుంది
ఒరే గుడిలోనే కాదు ప్రకృతిలోను దైవం ఉన్నాడు ఓపిక ఉన్నప్పుడే ఏదైనా చేయాలి చూడాలి అన్న మా మాస్టారు అదేరా మీ తాతయ్య చెప్పినది అక్షర సత్యం అని నా వైపు చూస్తే తెల్లని మీసం మెలివేయడం మనుమడు చూసి అందుకే మీరంటే నా కిష్టం అన్న మనుమడు చేయిని ఆప్యాయంగా తీసుకుంది మా ఇంటి ఆవిడ...!
.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి