స్వేచ్ఛ..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం


నదికున్న స్వేచ్ఛ వల్లా
అది మహాసముద్రం అయింది.
విత్తనానికి ఉన్న స్వేచ్ఛ వాళ్ళ 
అది మహారణ్యం అయింది. 
గాలికున్న స్వేచ్ఛ వల్ల 
అది భూమిపై ప్రాణమయింది..

ప్రకృతిలో అణువణున 
స్వేచ్ఛ ఉంది. 
దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. 

మనిషి జ్ఞానము సంపదను 
సృష్టించాడు. 
జ్ఞానంలో స్వేచ్ఛ ఉండాలి 
సంపదలో స్వేచ్ఛ ఉండాలి. 
నకిలీకి స్వేచ్ఛ లేదు 
నిజానికి స్వేచ్ఛ ఉంది. 

జ్ఞానము సంపద కన్నా 
స్వేచ్ఛ గొప్పది. 
స్వేచ్ఛ ప్రకృతి మెచ్చి ఇచ్చింది 
జ్ఞానము సంపద మనిషి 
తెచ్చుకున్నది. 

మనిషి- జ్ఞానము- సంపద లేకున్నా 
సహజంగా ఉండగలడు ప్రకృతితో 
కలిసిమెలిసి. కానీ 
జ్ఞానము- సంపద లేని మనిషి 
మరో మనసుతో స్వేచ్ఛగా ఉండలేడు. 
జ్ఞానము- సంపద మనిషిని బంధిస్తుంది 
స్వేచ్ఛ లేకుండా....!!?
====================================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు