సుప్రభాత కవిత : -బృంద


కురిసే కాంతుల తొలకరికి 
మెరిసే ఆకుల మెరుపులకు 
ఊగే కొమ్మల  ఊయలలే 
ఊపిరి  కాదా  ఉర్వికి!

వేచిన పుడమి పొత్తిళ్లలో 
వెచ్చగ నిదురించే పచ్చికకు 
గుచ్చిన తొలి కిరణపు స్పర్శ 
ముచ్చట కాదా కన్నులకు!

మగత వీడని మత్తున 
మళ్ళీ నిదురించే ఎత్తులకు 
మలయానిలపు  ఊపులు 
మేలుకొలుపు కాదా  మొగ్గలకు!

నీరసించిన ఆలోచనలతో 
నిర్లిప్త భావనలు రానివ్వక 
నిశ్శబ్దంగా  ఉత్తేజపరచే 
నిరుపమాన వరం కదా వెలుగంటే!

వెలుగుకు  ఎల్లలు 
కిరణానికి  పక్షపాతాలు 
వేకువకు  అడ్డంకులు లేక 
ఉత్సాహం  పంచేదే  కదా ఉదయం!

రేపటి వెలుగుపై రేగే 
ఊహల ఉయ్యాల ఊగే 
కలలు ఫలించే కమ్మని 
క్షణాల రాకకై ఎదురుచూచు 

హృదయాలకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు