సామెత-412: ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు
***
గదేందురుల్లా! నేనేం పాపం జేశిన.నన్ను బట్టుకుని గంతంత లావు మాటలంటుర్రు.నేనేవల్నన్నన్న నల్లంటినా? తెల్లంటినా?గాల్లేందవ్వా?నన్ను బద్నాం జెయ్యాలని సూత్తుర్రు.
శెల్లే!గా పంచాతి ఎంతకీ వొడ్వట్లేదని శికాకన్పిచ్చి ఇంటికొచ్చిన."కర్రిర్గదు-పాము సావదు" అన్న లెక్కుంది.గాల్లిద్దర్ల ఎవలికన్న జెరంతన్న వోపికుందా శెప్పు. గప్పుడట్ల జేశినవ్. గిప్పుడిట్ల జేశినవ్ అన్కుంట వొకల్నాపి ఇంకోలు మాట మాట అన్కునుడు పైంగ మనకి శెప్పుడు."
"అవునవ్వా! ఎవ్వల్ది యినకున్నా నా మాటెందుకింటరు.మీరొచ్చింది ఎందుకుల్లా అని దెప్పుడు. అట్లనుడు శిలికి శిలికి గాలి వోన లెక్క జేశిండ్రు.గందుల నన్ను యిరికిచ్చిర్రవ్వా!
"అయ్యో అవునా శెల్లే! నువ్వేమన్నవని నిన్నిరికిచ్చిర్రు. బాగనే ఉంది సక్కదనం. నువ్వు సుత పనుందని బయిటికొత్తే మంచిగుండు."
"వో అవ్వా! నువ్వు లేవంగనే సల్లగ జారుకుందమని లేశిన. గట్ల లేశిన్నో లేదో! శటుక్కున పట్టుకొని మీరినకుంటే ఇంకెవలు యింటరు అన్కుంట గదమ బట్కొని బుదగరిచ్చిర్రు."
గంత గనం అన్నరు గదాని కూసుంటే పొల్లగానోళ్ళు నన్నే తిట్ట బట్టిర్రు. పొల్లోల్లు నన్నేేె వద్దిచ్చబట్టిర్రు.యిష్యం సమజవ్వక తెల్లమొగం ఎయ్యిల్శి వొచ్చిందవ్వా! గాళ్ళు గాళ్ళు ఏవన్న అన్కోని.నన్నెందుకు గాల్ల పంచాతి లోకి గుంజిర్రు శెప్పవ్వా! గాళ్ళ మాటలిని నేనే గాల్ల నడ్మల లొల్లి వెట్టిన దాన్ని, కయ్యం గాయిచ్చిన దాని లెక్క నన్ను సూత్తుంటే యిజ్జత్ వొయ్యిందన్కో" నేను ఆడుండుడే "గాలికి వొయ్యే కంపని తలిగిచ్చుకున్నట్టైంది" .
"గదేంది శెల్లే! గట్లనుడేంది? ఉరుము ఉరిమి మంగలం మీద వడ్డట్టు ఉందిగదా!"
"అవునవ్వా! పాపం పున్నెం తెల్వని నన్ను బట్కొని అన్నన్ని మాటలన్నరు. నువ్వు ఏవైనా అనవ్వా" మెత్తటోళ్ళని సూత్తె వొత్త బుద్దైతదన్నట్టుంది."
"గదండీ సంగతి! "ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు"అంటే ఎలాంటి సంబంధం లేని అమాయికులను గిట్ల యిరికిచ్చినప్పుడు గీ శాత్రం శెప్తుంటరు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి