4 ఏళ్ల వయసులో:
మా నాన్నే బెస్ట్. ఆయనకంటే గొప్ప నాన్న ఈ ప్రపంచంలోనే లేరు.
6 ఏళ్ల వయసులో:
మా నాన్నకు అందరూ తెలుసు. ఆయనకు తెలియని విషయమే లేదు.
10 ఏళ్ల వయసులో:
మా నాన్న మంచివారే. కానీ ఆయనకు తరచూ కోపం వస్తుంది.
12 ఏళ్ల వయసులో:
ఛీ... నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నాన్న నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారు!
14 ఏళ్ల వయసులో : మా నాన్నకు తను చేసేదే కరెక్ట్ అనే అభిప్రాయం.
16 ఏళ్ల వయసులో: నాన్న పాతకాలపు మనిషి. ఇప్పటి కాలానికి తగిన విషయాలేవీ ఆయనకు తెలియవు.
18 ఏళ్ల వయసులో: నాన్న ఎందుకు ఇలా ప్రతిదానికీ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారో అర్థం కాదు!
20 ఏళ్ల వయసులో: నాన్నతో కలిసి ఉండటమే కష్టంగా ఉంది. అమ్మ ఇన్నాళ్లూ ఆయనతో ఎలా వేగిందో ఏమో!
25 ఏళ్ల వయసులో: నాన్నకు ఏమైంది? నేను ఏం చేసినా ముందు వ్యతిరేకించడమే ఆయన పని!
30 ఏళ్ల వయసులో: నా కొడుకును దారిలో పెట్టడమే చాలా కష్టంగా ఉంది. నేను చిన్నప్పుడు నాన్నకు ఎంత భయపడి ఉండేవాడినో కదా!
40 ఏళ్ల వయసులో: హ్మ్... ఆ రోజుల్లో నాన్న నన్ను ఎంత క్రమశిక్షణతో పెంచారో! నేను కూడా నా కొడుకును అలాగే పెంచాలి.
45 ఏళ్ల వయసులో: పిల్లలను, ముఖ్యంగా టీనేజ్ పిల్లలను పెంచడం అంత సులభం కాదు. నన్ను నాన్న ఎలా అదుపులో పెట్టారో ఏమో!
50 ఏళ్ల వయసులో: ఎన్ని కష్టాలు ఎదురైనా నాన్న మా అందరినీ ఎంతో చక్కగా పెంచారు. కానీ నాకు నా ఒక్క కొడుకును కూడా సరిగ్గా పెంచడం చేతకావడం లేదు.
55 ఏళ్ల వయసులో: మా నాన్న నిజంగా దూరదృష్టి ఉన్న మనిషి. ఆయనకు ఆయనే సాటి!
60 ఏళ్ల వయసులో: మా నాన్నే బెస్ట్. ఆయనకంటే గొప్ప నాన్న ఈ ప్రపంచంలోనే లేరు!
ఇలా మళ్లీ మొదటి స్థాయికి రావడానికి ఒక కొడుకుకు 56 ఏళ్లు పడుతుంది.
కానీ ఒక కూతురికి మాత్రం మొదటి నుంచీ తన నాన్నే బెస్ట్! ఆ అభిప్రాయం నుంచి బయటకు రావాలనే ఆలోచనే ఆమెకు రాదు. అందుకే నాన్న గొప్పతనాన్ని గుర్తించడానికి ఆమెకు యుగాలు పట్టవు!
నాన్న విలువ కొడుకుకు వయసు పెరిగేకొద్దీ అర్థమవుతుంది... కూతురికి మాత్రం నాన్న ఎప్పుడూ హీరోనే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి