మజిలీ ఒక్కటే!
మమతలన్ని ఉన్నా
మనుగడ ఒకటే!
మార్పులెన్ని చేసినా
పయనం ఒకటే!
తీర్పులెన్ని వచ్చినా
గమనం ఒకటే!
ప్రశ్నలెన్ని అడిగినా
పరీక్ష ఒకటే!
ప్రతీక్ష లెన్నున్నా
ప్రత్యూషం ఒకటే!
తలపులెన్ని దాచినా
మౌనం ఒకటే!
పిలుపులెన్ని దాగినా
మనసు ఒకటే!
పోరాటాలెన్నో అయినా
పోరు ఒక్కటే!
ఆరాటాలెన్ని ఉన్నా
ఆర్తి ఒకటే!
చిక్కులెన్ని ఉన్నా
చింత ఒకటే!
మొక్కులెన్ని ఉన్నా
దైవం ఒకటే!
చివురుతో తరువు!
ఆశతో బ్రతుకు!
తూర్పు తో రేపు!
వెలుగుతో వేకువ!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి