గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ...:
యుగయుగాలు గిరగిర
శృతులనుండి మొదలై
పుస్తకాలవరకు సాగుతూ
సాగుతున్న యజ్ఞం
ఆరిపోని నిరంతర యత్నం!!
తాటాకుల నుండి ఆరంభమై
సాంకేతికతను పట్టుకుని
జ్ఞాననిధికి ఆలవాలమై
విజ్ఞానానికి ఆలంబనగా నిలుస్తూ
ముందుతరాలకు బాసటగా కొనసాగుతూ
మస్తిష్కాన్ని పడునుబెట్టే మంత్రరాజం
ఎన్ని యుగాలైనా మాసిపోని తంత్రం!!
మస్తకంలో దాగిన మణులు
రాతపుస్తకంలో నిధులు
పదిలంగా దాచిన జ్ఞాననదులు
తరిచిపోని భాన్డాలు
మరచిపోని సూత్రాలు!!
పుస్తకమే కదా జ్ఞాన ప్రకాశం
ఎల్లకాలము జ్ఞాన ప్రవాహం
వాల్మీకి మొదలు నేటి వరకు
మనకందించిన ఎంతోమంది
తాము లేకున్నా
దాచివుంచిన జ్ఞాననిధి రూపం
అందరం అందుకున్న అందుకుంటున్న
అందుకోబోతున్న జ్ఞాన వృక్షసముచ్చయం
సర్వకాలం సర్వోపయోగం
చారిత్రాత్మక రూపం
సకలశాస్త్ర సమున్నతం!!
భూతకాలవు పొత్తం
భావితరాలకు దారిదీపం
వర్తమానానికి చేయూతరూపం!!
---------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి