అమావాస్య నాడు వచ్చే పున్నమి దీపావళి రోజున
కులమతభేధాలు పోవాలని
పేద గొప్ప తారతమ్యాలుండకూడదని
స్వార్ధం, అసూయలు దూరం కావాలని
అనురాగ ఆప్యాయతలతో
ప్రజలంతా ఉండాలని
అత్యాచారాలు,మూఢనమ్మకాలు పోవాలని
అన్నార్తుల ఆకలితీర్చి
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి
మనలో ఉన్న అసురప్రవృత్తులయిన రాగద్వేషాలను, హింసాత్మక ప్రవృత్తి అంతమొందించాలని
సమాజంలో ప్రజలంతా సుఖసంతోషాలతో
ఆనందంగా ఉండాలని
శాంతి, అహింసలే ప్రగతికి సోపానమని
కలసిమెలసి ఉంటే సాధించలేనిది ఏది జగతిన ఉండదని
బాణసంచా కాల్చి
వసుదైక కుటుంబమంతా ఒకటే అని వెలుగుల వేకువ దినాన ప్రతినపూని
లోకా సమస్తా సుఖినో భవంతు అని చాటుదాం..!!
................…...........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి