తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా టెన్నీ కైట్ అసోసియేషన్ఆధ్వర్యంలో ఈ నెల 1 న హైదరాబాద్ అంబర్‌పేట ప్లే గ్రౌండ్ లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల పోటీలలో వికారాబాద్ జిల్లా నుండి పాల్గొని, క్రీడా ప్రతిభను చాటి రాష్ట్రస్థాయి పోటీలలో తాండూర్ కేజీబీవీ బాలికలు వరలక్ష్మి కాంష్య పథకం, నందిని బాయ్ 4వ స్థానం , నికిత 5వ స్థానం, భాగ్యశ్రీ 6వ స్థానం, పొంది హైదరాబాద్ ఎడిషనల్ ఎస్పీ నర్సయ్య,రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్ అగ్రవాల్ ,ఉపాధ్యక్షుడు బి.గోపాలం, కోశాధికారి రాజు ద్వారా ప్రశంసా పత్రములు అందుకున్నట్లు పాఠశాల ఎస్ఓ ఆశాలత ,బాలమణి తెలిపారు .
అడిషనల్ ఎస్పీ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ ముఖ్యంగా శ్రద్ధతో బాగా కష్టపడి ఇష్టపడి చదివి రాణించాలని అలాగే చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుశీల్ కుమార్, కార్యదర్శి సత్యనారాయణ, మద్దూర్ పిఈటి మమత, ఊట్కూర్ పీఈటి రమ్య, అరుణ ,రాజు ,సుధా గిరి కురుమెష్ పాల్గొన్నారు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి