తిరుమలరావుకు విజయనగరం శ్రీశ్రీ కళావేదిక సత్కారం
 

పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును శ్రీశ్రీ కళావేదిక ఘనంగా సన్మానించింది. 
విజయనగరం జిల్లా కేంద్రంలో గురజాడ పాఠశాల ఆడిటోరియంలో శ్రీశ్రీ కళావేదిక, తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్తంగా నిర్వహించిన విజయనగర సాహితీ వైభవం, జాతీయ సాహిత్య సంగీత సాంస్కృతిక మహోత్సవ వేదికపై తిరుమలరావు శ్రీశ్రీ కదనం కవనం అనే స్వీయ గీతాన్ని ఆలపించి సన్మానం పొందారు. శ్రీశ్రీ కళావేదిక 177వ సమావేశంలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొన్న తిరుమలరావును శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి డా.టి.పార్ధసారథి, ఉత్తరాంధ్ర కన్వీనర్ డా.డబ్బీరు గోవిందరావు, విజయనగరం జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్, జిల్లా అధ్యక్షులు గొర్లె సీతారామమూర్తి, గౌరవ సలహాదారులు డా.స్వప్నహైందవి, ప్రధాన కార్యదర్శి సాలూరు సంతోషి, కార్యదర్శి మానాప్రగడ సాహితి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఈపు విజయకుమార్ తదితరులచే శాలువా జ్ఞాపిక పుష్పగుచ్చం కానుకలతో ఘనంగా సన్మానించారు. తిరుమలరావు సాహిత్య సన్మానం పొందుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు