సుప్రభాత కవిత : - బృంద


అల్లిన కలల సౌధము 
మెల్లగా పూర్తి కాగా 
కొల్ల అయిన సంతోషానికి 
ఎల్లలు కనిపించవుగా!

కనిపించని కోరికల 
మెరిసే దారాలతో 
కనువిందుగా కట్టుకున్న 
కమ్మని గూడున....

లెక్కలేని గదులు 
చిక్కు లేని హృదయాలు 
పెక్కు ఆనంద డోలికలు 
మిక్కిలి ముచ్చటలు....

మదిలోని గదులలో 
మాసిపోని మమతలతో 
మనసుతీరా నవ్వుకునే 
మనుగడేగా జీవితం...

చిన్ని గాలికి చెదిరినా 
ఎన్నో ముడులు తెగినా 
మిన్ను విరిగి మీదపడ్డా..
దన్నుతో తిరిగి నిలిచి....

తీర్పు ఇదేననుకుని 
ఓర్పుగా అల్లుకుని 
మార్పు తప్పదని 
తూర్పు చూచే ఆశేగా జీవితం!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు