అలసిన మనసుకు ఓదార్పు ఆశ
భవిష్యత్తుపై భరోసానిచ్చేది ఆశ
ఆగని అడుగులు నీతో వేయించేది ఆశ
ఆశ లేక ముందుకు సాగదు జీవితం
నిరాశ కమ్మిన వేళ నిస్సారమై తోచే
బ్రతుకున వెలుగుకిరణమై
కన్నీటి తడిలోనూ చిరునవ్వును
పూయించి మెరిపించేది ఆశ
కష్టాల సుడిగుండాన్ని దాటించేది
బాధల సాగరాన్ని భరోసాతో ఈదించేది
ఓర్పుతో ముందుకు సాగిపొమ్మని
మనసుకు ధైర్యాన్నిచ్చేది ఆశే!
రేపటి రోజుపై నమ్మకాన్ని పెంచి
కష్టాలు శాశ్వతం కావని తెలిపి
మదిలో ధైర్యాన్ని నింపి
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా
అడుగులు వేయించేది ఆశే!
ఆశ ఉంటే ఆలస్యంగానైనా
సిద్ధిస్తుంది ఆశయం
ఆశకు కృషి తోడైతే
తప్పక వరిస్తుంది విజయం
ఆశతోనే బ్రతకాలి
ఆశతోనే ముందుకు సాగాలి!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి