గెలుపు-ఓటమి: - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల


గెలుపు ఓటముల కలయికయే
కదా మానవ జీవితమంటే!
స్వీకరించక తప్పదు కదా
ప్రయత్నానంతర ఫలితాన్ని!

గెలుపు పెంచితే ఆత్మవిశ్వాసాన్ని,
ఓటమి ఇస్తుంది అనుభవాన్ని!
గెలుపుతో పొంగిపోక, ఓటమిలో కృంగిపోక,
స్థితప్రజ్ఞతతో వ్యవహరించడమే మనిషి కర్తవ్యం!

ఓటమి ఎదురైందని ఆగిపోక,
అపజయాన్ని చూసి ఆశ వదులుకోక,
ప్రతి ఓటమిని ఓ గుణపాఠంగా మలచుకుని,
విజయం వైపు అడుగులు వేయాలి!

ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుని,
పట్టుదలను పథనిర్దేశంగా మలచుకుని,
అలుపెరుగని ఆశయంతో ముందుకు సాగుతూ,
గెలుపు శిఖరాలను అధిరోహించాలి!

పనిలో గెలుపోటముల ఫలితం
ఎలా ఉన్నా స్వీకరించక తప్పదు!
కానీ మానవత్వపు విలువల విషయంలో మాత్రం
ఎన్నడూ ఓటమిని చవిచూడక,
గెలుపుబాటలోనే పయనించడం మన ధర్మం!
అదే మనిషి జన్మకు సార్థకత!
కామెంట్‌లు