సుమతీ శతకం ౩౨వ పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన యట్లు పామరుఁడు దగన్ హేమంబుఁ గూడఁబెట్టిన భీమీశులపాఁ జేరు భువిలో సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .. పాములు సొంతంగా పుట్టలు కట్టలేవు. చీమలు ఎంతో కష్టపడి చేసిన పుట్టలనే తమ ఇళ్ళుగా చేసుకుంటాయి. చీమలు తమ కోసమని కట్టుకున్న పుట్టలు పాములకు నెలవులు అవుతాయి. అదేవిధంగా, లోభి అయిన మనిషి తన అవసరాలు కూడా తీర్చు కోకుండా, ఇతరులకు సహాయం చేయకుండా దాచిపెట్టిన సొమ్ము, బంగారం, సంపద అంతా చేరితే రాజు (గవర్నమెంట్) దగ్గరకి చేరుతుంది లేదా దొంగల పాలౌతుంది. తాను, తన వారు మాత్రం అనుభవించ లేరు. ........... ....అని సుమతీ శతకకారుని వాక్కు. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు