ప్రతి ఉపాధ్యాయుడు
ఒక సూర్యుడే ఒక చంద్రుడే!!
ఉపాధ్యాయునికి
వీడ్కోలు ఉండదు.!!
సూర్యచంద్రులకు
వీడ్కోలుండదు......!!!
అస్తమించిన రేపు మళ్లీ ఉదయిస్తారు.
విద్యార్థులారా!!
ఆకాశంలో నక్షత్రాలు మీరు
ఆకాశంలో ఎగిరే పక్షులు మీరు
పొలంలో విత్తిన విత్తులు మీరు
నదుల్లో పారే నీరు మీరు
మైదానాల్లో మహా వృక్షాలు మీరు!!
ఎత్తయిన పర్వతాల్లా
ఎదగాలి మీరు.
లోతైన సముద్రాల్లా
ఒదిగి ఉండాలి మీరు!!!
ప్రతి పాఠము ఒక జీవిత పాట కావాలి.
ప్రతి ఆట నీటి అలా కావాలి
మీ ప్రతికలా నిజం కావాలి.
అక్షరాలే మీకు లక్ష్యం
అక్షరాలే మీకు సాక్ష్యం
అక్షరాలే మీకు లక్షల సంపాదన!!!
ప్రతి ఉపాధ్యాయుడు
ఒక సూర్యుడే ఒక చంద్రుడే
ఉపాధ్యాయునికి వీడ్కోలు ఉండదు
సూర్యచంద్రులకు వీడ్కోలు ఉండదు
అస్తమించినా రేపు మళ్లీ ఉదయిస్తారు.
బిజినేపల్లి మండలం ఎంఈఓ గౌరవనీయులు పూజ్యులు శ్రీ రఘునందన్ శర్మ గారి పదవీ విరమణ సందర్భంగా.
29/03/2023

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి