బంగినపల్లి మామిడికాయ కధ-- డాక్టర్.బెజ్జంకి.-- పండ్ల జాతులలో మామిడిపండు ఒకటి.ఇది మధురమైన పండు.పిల్లలు పెద్దలు, అందరూ ఇష్టపడేపండు. ఈమామిడి పండులో విటమిన్-ఏ,సి, బి1,బి2,బి3, డి,విటమిన్ లు ఉన్నాయి.-పొటాషియం,పోలిక్ యాసిడ్లు కెరోటెన్,కాల్షియం వున్నాయి.మంచి బలమైన ఆహారం.ఇందులో ప్రతి 100గ్రాములకు, 17గ్రా:పిండిపదార్ధం,14.8గ్రా!!చక్కర, 1.8గ్రా:పీచుపదార్థాలు1%మాంసకృత్తులు, మొదలైనవివున్నాయి.70క్యాలరీల శక్తినిస్తుంది.మామిడికాయ విత్తును మనం మామిడిటెంక అంటాము.ఇది సుమారు 4నుండి7సెం:మీ: పొడవు,3నుండి4సెం:మీ:వెడల్పు,1సెం:మీ:మందంగా వుంటుంది ఈటెంకలో ఉండే పప్పును జీడి అంటాము.ఈ జీడి ఔషద గుణములు కలిగివుంది.ఇది విరోచనాలు,కాలేయ వ్యాధులు,ఆర్షమొలలను అరికడుతుంది.క్యాన్సర్ ను అదుపుచేస్తుంది.మామిడి చెట్టు ఇది మాంగీఫెరా జాతికి చెందినది.ఆంగ్లంలోMANGO(మ్యాంగో)అని,సంస్కృతంలో 'ఆమ్రఫలమని'అంటారు.ప్రసిద్ధిచెందిన పంచభూత క్షేత్రాలలో కాంచిలో ఉన్న ఏకామ్రేశ్వర ఆలయం ఒకటి.మామిడి చెట్టుక్రింద స్వామి వెలిశాడు.అందుకే ఆ పేరువచ్చిం మామిడిచెట్టు 90నుండి 120 అడుగుల ఎత్తుపెరుగుతుంది.దాదాపుగా 30అడుగుల వ్యాసంలో గుబురుగా విస్తరిస్తుంది.కాయలు పొడవాటి కాడకు వేలాడుతుంటాయి .3నుండి6మాసాలలో కాయలు పక్వానికి వస్తాయి.ఒకొక్క కాయ సుమారుగా100గ్రాముల నుండి 2.5కిలోల బరువు ఉంటుంది.దీనిఆకులు దళసరిగా 10నుండి 30సేమీ, పొడవుగా 6నుండి10 సెం,మీవెడల్పుగా వుంటాయి.ఎక్కువ రోజులు పచ్చగా ఉంటాయి.గాలిని శుభ్ర పరిచి ఆక్సిజన్ ను మనకు ఆందిస్తాయి.అందుకే శుభకార్యాలకు ఇంట్లో పందిళ్ళ లో మామిడి ఆకుల తోరణాలు కడతారు.మామిడి ఆకులు శుభప్రధమైనవి. కోకిలలు మామిడి చిగురును ఇష్టంగా తింటాయి.అందుకే నేమో కోకిల కంఠ మృదువుగావుంటుంది.ఉగాది పచ్చడిలో మామిడి పిందెలన ప్రధానంగావాడతాము. మామిడి కాయలు వేసవి కాలంలో అధికంగా వస్తాయి.పుల్లని మామిడి కాయలతో ఊరగాయపచ్చడి చేస్తారు.ఆవకాయ పచ్చడి బహు రుచికరమైనది.తెలుగువారు ఇష్టపడే పచ్చడి. మాగా పచ్చడి కూడ పెట్టుకుంటారు.వీటిలో జలాలు ఒక రకం.చిత్తూరు కాయలు,కొబ్బరి మామిడి, మధురమైన రసాన్ని జుర్రుకునేవాటిని రసాలు అంటాము.జీడి మామిడి ఒకరకం దీనినుండి జీడిపప్పు వస్తుంది.ఇవిగాక ఉలపాడు,నూజివీడు,పలనాటిలో పట్లవీడు లో కాసిన కాయలకు మంచి గిరాకీ ఉంటుంది.కానీ బంగినపల్లి మామిడి కాయలకు దేశవిదేశాలలో మంచి గిరాకీ ఉంది.భారత దేశంనుండి అమెరికా,బ్రిటన్ దేశాలకు ప్రతియేట 5500టన్నుల పైచిలుకు కాయలు ఎగుమతి జరుగుతోంది.ఎగుమతిలో ప్రధమస్ధానం బంగినపల్లికి వుంది.బనగానపల్లె నవాబు ఆరోజులలో స్త్రీపురుషులు(రైతులు)మామిడికాయల బొమ్మతో మొహరీలుముద్రించారు.ఈమామిడిపండు ఆంధ్రప్రదేశ్ సొంతమని "భౌగోళికవిశిష్టగుర్తింపు"( జియో గ్రాఫికల్ ఐడెంటిఫికేషన్--జీ.ఐ.)లభించింది. ఇంతటి విశిష్టత గిరాకీ ఎందుకు వచ్చిందో ఆ కధ ఏమిటో దాని పూర్వ చరిత్రను తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మంగారు బనగానపల్లె గ్రామం లోని గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లోఉన్నారు. గోవులను కాశారు.గోవుల ను అడవికి తోలుకెళ్ళి ఒకచోట గుంపుగా ఉంచి చుట్టూ గీత గీసే వారు.ఆగీతలో అవి మేతమేస్తూ ఉంటాయి. ఎటూపోవు.పెద్దపులులు,సింహాలు ఆవులపైకి వచ్చి గీతదాటి లోపలికి పోలేక పోయేవి. అది బ్రహ్మంగారి మహిమ. బ్రహ్మంగారు అక్కడున్న 'రవ్వల కొండ'గుహ లోకి వెళ్ళబోయేముందు అక్కడున్న తాటి చెట్టు క్రిందకు వంగేది.బ్రహ్మంగారు ఆ తాటి చెట్టు మొవ్వు ఆకులు కోసుకునిగుహలోకి వెళ్ళగానే మళ్ళీ తాటిచెట్టు పైకిలేచేది.లోపల పెద్దబండ మీద కూర్చుని 'కాలజ్ఞానం' రాసేవారు. సాయంత్రం బయటకు వచ్చేవారు.బయటకు రాగానే అక్కడ ఉన్న మామిడి చెట్లు ఆనందంతో తలలు ఊపికొమ్మలువంచిమామిడిపండ్లుఇచ్చేవి.బ్రహ్మంగారు ఆ మామిడి పండ్లు తిని ,గోవులను తోలుకొని బనగానపల్లె అచ్చమ్మగారి ఇంటికి వెళ్ళేవారు.ఇలా కొంత కాలం గడిచింది. బ్రహ్మంగారు అడవిలో ఆవుల చుట్టూ గుండ్రంగా గీత గీసి నిలబెడు తున్నారు ఆవులు అడవిలో తిరిగి మేతమేయటం లేదు గీతలోనే ఉంటున్నాయి ,అని ఆ దారి వెంట వెళ్ళేవారు చూచి అచ్చమ్మగారికి రోజూ చెపుతున్నారు.కానీ ఆవులు పాలు బాగా ఇస్తున్నాయి.మేత మేయక పోతే పాలు ఇవ్వవు గదా అని వారి మాటలు నమ్మటంలేదు.అయినా ఒకరోజు చూడాలి అనుకుంది.ఒకరోజు వెనకాల వచ్చింది. ఆవులచుట్టూ గీతగీసి గుహలోకి వెళ్ళటం చూసింది.గుహలో ఎంచేస్తున్నారో చూడాలని గుహదగ్గరకు వెళ్ళింది.లోపలకు తొంగి చూసింది.బ్రహ్మంగారు 'కాలజ్ఞానం' రాస్తున్నారు.ఆయన చుట్టూ తేజస్సు వెలుగులు చిమ్ముతోంది. ఆశ్చర్యపోయింది, బ్రహ్మంగారు ఆవుల కాపరికాదుమహానుభావుడని గ్రహించింది అచ్చమ్మ.ఇంటికివెళ్ళిపొయింది.బ్రహ్మంగారు దివ్యదృష్టితో తెలుసుకున్నారు.గుహనుండి బయటకు వచ్చారు. మామిడి చెట్టు కాయలు ఇచ్చింది. కొమ్మలు వంగి బ్రహ్మంగారికి పాదాభివందనం చేశాయి "కలియుగంలో బనగానపల్లెమామిడికాయలు మధురంగా ఉండి కలకాలం ప్రసిద్ధి నొందుగాక" అని వరమిచ్ఛారు. తాటిచెట్టువంగి పాదాభివందనం చెసింది ఆకులకు చల్లదనాన్ని ప్రసాదించారు.ఆవులు తోలుకొని ఇంటికి వెళ్ళారు.అచ్చమ్మ కాళ్ళమీద పడి క్షమించండి అని వేడుకొంది ఆమెకు కాలజ్ఞానం బోధించారు. అప్పటినుండి బనగానపల్లె లో మామితోటలు విపరీతంగా పెరిగిపోయాయి.బాగా కాయలు కాస్తున్నాయి. రైతులు మామిడి సాగు చేయటం మొదలు పెట్టారు. బనగానపల్లె మామిడి కాయలు బాగా తియ్యగావుంటాయి.విపరీతమైన గిరాకీ పెరిగింది.బనగానపల్లె మామిడి కాయలు,బనగానపల్లె మామిడికాయలు,అని జనం బాగా కలవరించేవారు.ఆపేరు రాను రాను "బంగినపల్లి మామిడి" కాయలుగా ప్రసిద్ధి గాంచినవి.మనం ఇష్టంగా కొని తినే బంగినపల్లి మామిడికాయల పూర్వ చరిత్ర ఇది.బంగినపల్లి మామిడి కాయలకు బ్రహ్మం గారు ఇచ్చిన వరంతో దేశ విదేశాలలో మంచి గిరాకీ వచ్చింది.ఇది బంగినపల్లిమామిడిపండు అసలు కధ. -----బెజ్జంకి కధలు---డాక్టర్.బెజ్జంకి.9848562726.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి