మనిషి మాత్రమే ఊహిస్తాడు.!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
 మనిషికి ఊహ కళ్ళ ముందు ఉన్నదాంట్లోంచి రాలేదు. లేని దాంట్లో నుంచి వచ్చింది. కళ్ళ ముందు కనిపించింది నిజం. కలలో కనిపించింది ఊహ. అంటే కలలన్నీ ఊహలే. కానీ కొన్ని నిజాలు కూడా ఉంటాయి. కలలు నిజాల నుంచి కూడా పుడతాయని మనకర్తమవుతుంది. మనిషి భూమిపై నడుస్తాడు పరిగెత్తుతాడు కానీ ఎగరలేడు. ఎగరాలనుకోవడం ఊహ- ఎగిరినట్లు కలకనడం ఊహ. కళ్ళ ముందు ఉన్నవాటినీ తాను సృష్టించలేదు .కానీ సృష్టించినట్లు కలగంటాడు. అంటే ఊహిస్తాడు. కళ్ళముందున్నవి మాయం చేయలేడు కానీ మాయం చేసినట్లు ఊహిస్తాడు. అంటే కలగంటాడు. కళ్ళ ముందు కనిపించే జీవులు- వస్తువులుగా- మారలేడు .కానీ వాటి రూపాల్లోకి మారినట్లు ఊహిస్తాడు కలగంటాడు. ఒకటి మరో రూపంలోకి- ఒకరు మరొకరి రూపంలోకి మారినట్లు ఊహిస్తాడు కలగంటాడు. ఇది ఇంటలిజెన్సీ కాదు ఫాంటసీ మాత్రమే. కేవలం బ్రమ మాత్రమే, అంటే ఊహ ఒక బ్రమ -ఒక మాయ- మాత్రమే. 
ఇలా మనిషి మాత్రమే ఊహిస్తాడు మరే జంతువు ఇలా చేయలేదు. ఈ ఊహ- ఇంటిలిజెన్సీ పుట్టిన తర్వాతనే సాధ్యమైంది. ఇంటలిజెన్స్ కి పూర్వం ఊహ లేదు. అంటే ఇమాజినేషన్ లేదు. కేవలం ఇంటలిజెన్స్ జీవుల్లో ఏర్పడిన తర్వాతనే ఊహ పుట్టింది. ఆ తర్వాత మనిషి డిజైర్స్ అన్ని కలలుగా ఊహలుగా మారుతాయి. మనిషి వాటిని నిజం చేసుకోవాలనుకుంటా డు అంటే నిజం కావాలని కోరుకుంటాడు. వాటినే మనం యాంబిషన్స్ అంటాం. బలమైన డిజైర్ -బలమైన ఎమోషన్- అంబిషనుగా- మారుతుంది. ముఖ్యంగా- ఊహ- ఫాంటసీ -జీవుల్లో శృంగారం నుంచే పుట్టింది. ఆ తర్వాత ఎమోషన్స్ నుంచి కూడా పుట్టినట్లు మనకు అర్థమవుతుంది. డిజైర్ ఫాంటసీ గా ఇమేజినేషన్ గా మారి ఊహగా మారుతుంది. ఊహల్లో మొట్టమొదటిది ఆఖరిది కేవలం శృంగారమే. దానిలోంచే ఊహ పుట్టిందని మనం గుర్తించాలి. నమ్మాలి. ఆ తర్వాత ఎమోషన్స్ నుంచి కూడా ఊహ పుట్టినట్లు శాస్త్రీయంగా మనం భావించవచ్చు. అంటే ఊహ పుట్టుకకు కారణం శృంగారము ఎమోషన్స్ అనీ మనం భావించాలి.
డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.
శ్రీ శ్రీ కళావేదిక.

కామెంట్‌లు