సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించారాయన. తెలుగు సినీ ప్రపంచంలో, నౌషాద్‌వంటి హిందీ సంగీత దర్శకులచే గుర్తించబడి, గౌరవింపబడ్డ ఒకే ఒక సంగీత దర్శకుడు మన ” సాలూరు రాజేశ్వర రావు”. సాలూరు రాజేశ్వరరావు సాలూరు మండలములోని శివరామపురం గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు వద్దే “సరిగమలు” దిద్దాడు.
తెలుగు సినీ రంగంలో ఎవరైనా “చైల్డ్‌ప్రొడిజీ”లు ఉన్నారంటే వాళ్ళలో అందరికన్నా ముందుండే వ్యక్తి సాలూరు రాజేశ్వర రావు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు, నాలుగేళ్ళ వయసులోనే రాజేశ్వరరావు అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరో మూడేళ్ళు గడిచేసరికి అన్న హనుమంతరావుతో కలిసి పాట కచేరీలు ఇవ్వడం, హరికథలు చెప్పడం మొదలు పెట్టాడు. రాజేశ్వరరావు ప్రతిభను గుర్తించి హచ్చిన్స్ గ్రామఫోను కంపెనీ బెంగుళూరుకు ఆహ్వానించడం జరిగింది. 1933-34 మధ్యకాలంలో “బాల భాగవతార్ మాస్టర్ సాలూరి రాజేశ్వరావు ఆఫ్ విజయనగరం” కంఠం గ్రామఫోను రికార్డుల ద్వారా (భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు, మోతీలాల్ నెహ్రూ పై పాటలు మొదలగునవి) మొదటిగా విజయనగరం ఎల్లలు దాటి యావదాంధ్రదేశానికీ పరిచయమయింది.
ఇతని గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన పినపాల వెంకటదాసు, గూడవల్లి రామబ్రహ్మం తమ (వేల్ పిక్చర్స్) రెండవ చిత్రానికి, (శ్రీకృష్ణ లీలలు,1935), ఇతనిని “కృష్ణుడి” పాత్రధారునిగా ఎంపిక చేసుకొని మద్రాసుకు చేర్చారు. తొలిచిత్రంలోనే తన గాన, నటనా కౌశలాన్ని సాలూరి తెలుగు ప్రేక్షకులకు చాటి చెప్పాడు. ఆ చిత్రంలో, ముఖ్యంగా, కంసునితో (వేమూరి గగ్గయ్య) సంవాద ఘట్టంలో, గగ్గయ్యలాంటి ప్రఖ్యాత కళాకారునికి దీటుగా ఆయన పాడినపద్యాలు (”ఔరలోక హితకారి”,”దీనావనుడనే”, “ప్రణతులివె”,”మేనల్లుళ్ళని”, ...) వింటుంటే పదమూడేళ్ళ వయసులోనే సాలూరి సంగీత ప్రతిభ ఎంతటిదో తెలుస్తుంది.
తదనంతరం ఈయన కలకత్తా చేరుకున్నారు..
కలకత్తాలో,”న్యూ థియేటర్స్ సంగీతత్రయం”తో (ఆర్.సి.బోరల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్) పరిచయాలకు, ప్రముఖ గాయకుడు కె.ఎల్.సైగల్ వద్ద శిష్యరికానికి దారి తీసింది. ఇలా ఒక సినిమాలో నటించడానికని కలకత్తా చేరిన వ్యక్తి సంవత్సర కాలం పైగా అక్కడే వుండిపోయి, అక్కడి ఉద్దండుల వద్ద (హిందుస్తానీ) శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలు, బెంగాలీ, రవీంద్ర సంగీతరీతులు, వాద్యసమ్మేళన విధానం నేర్చుకున్నాడు. ఆయన తదుపరి సంగీత సృష్టిలో అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1938లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత సంగీతబృందాన్ని ఏర్పాటు చేసుకొని ఒక తమిళ చిత్రానికి (”విష్ణులీల” 1938) సహాయ సంగీత దర్శకునిగా పనిచేశాడు. మరికొద్ది కాలానికి చిత్రపు నరసింహరావు దర్శకత్వంలో తయారయిన “జయప్రద”(పురూరవ 1939) చిత్రానికి పూర్తి సంగీతదర్శకత్వపు బాధ్యతలు చేపట్టి, అప్పట్లో అత్యంత యువ సంగీతదర్శకుడిగా చరిత్ర సృష్టించాడు. కాని ఆయనకు సినీ సంగీతదర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా ఇల్లాలు.
*సాలూరి వారు సంగీతం అందించిన సినిమాలు*
జయప్రద (1939) (సంగీత దర్శకునిగా మొదటి సినిమా)
ఇల్లాలు (1940)
జీవన్ముక్తి (1940)
అపవాదు (1941)
బాలనాగమ్మ (1942)
చెంచులక్ష్మి (1943)
భీష్మ (1944)
పాదుకా పట్టాభిషేకం (1945)
రత్నమాల (1947)
చంద్రలేఖ (1948) (తమిళం)
వింధ్యరాణి (1948)
ఆహుతి (1950)
అపూర్వ సహోదరులు (1950)
మంగళ (1951)
మల్లీశ్వరి (1951) - ఆకాశ వీధిలో హాయిగా, అవునా నిజమేనా?, పరుగులు తీయాలి, పిలిచినా బిగువటరా!
ప్రియురాలు (1952) (అద్దేపల్లి రామారావు, బి.రజనికాంతరావుతో)
నవ్వితే నవరత్నాలు (1951)
ప్రియురాలు (1952)
వయ్యారి భామ (1953)
పెంపుడు కొడుకు (1953)
రాజు-పేద (1954)- జేబులో బొమ్మ
విప్రనారాయణ (1954) - సావిరహే తవదీనా
మిస్సమ్మ (1955)- ఆడువారి మాటలకు అర్దాలే వేరులే, బృందావనమిది అందరిదీ, రావోయి చందమామ
బాల సన్యాసమ్మ కథ (1956)
భలేరాముడు (1956)- ఓహో మేఘమాలా
చరణదాసి (1956)
అల్లావుద్దీన్ అద్భుత దీపం (1957)
భలే అమ్మాయిలు (1957) - మది ఉయ్యాలలూగే
మాయాబజార్ (1957) (నాలుగు పాటలకు మాత్రమే)
సతీ సావిత్రి (1957)
చెంచులక్ష్మి (1958) - పాల కడలిపై శేష తల్పమున, నీల గగన ఘనశ్యామా, చెట్టులెక్కగలవా?
అప్పుచేసి పప్పుకూడు (1959) - అప్పుచేసి పప్పు కూడు తినరా, సుందరాంగులను చూసినవేళ, ఎచ్చట నుండి వీచెనో, కాశీకి పోయాము రామాహరి
భక్త జయదేవ (1961) - నాదు ప్రేమ భాగ్యరాశి
ఇద్దరు మిత్రులు (1961) - ఖుషీ ఖుషీగా నవ్వుచూ, హల్లో హల్లో ఓ అమ్మాయి, ఈ ముసిముసి నవ్వుల
భార్యాభర్తలు (1961) - ఏమని పాడెదనో, జోరుగా హుషారుగా,
భీష్మ (1962) - మహదేవ శంభో, మనసులోని కోరిక
ఆరాధన (1962) - నా హృదయంలో నిదురించే చెలి, ఆడదాని ఓర చూపుతో, నీ చెలిమి నేడే కోరితిని
కులగోత్రాలు (1962) - చెలికాడు నన్నే పిలువా,అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే
చదువుకున్న అమ్మాయిలు (1963) - ఒకటే హృదయం కోసము, వినిపించని రాగాలే, ఈ నల్లని రాలలో, కిలకిల నవ్వులు చిలికిన
పూజాఫలం (1964) - నిన్నలేని అందమేదో, పగలే వెన్నెలా
బొబ్బిలి యుద్ధం (1964)- శ్రీకర కరణాలవాల వేణుగోపాల, ముత్యాల చెమ్మ చెక్క, అందాల రాణివే, మురిపించే అందాలే
మంచి మనిషి (1964)
అమరశిల్పి జక్కన (1964) - నిలువుమా నిలువుమా నీలవేణి, అందాల బొమ్మతో ఆటాడవా?
మైరావణ (1964)
డాక్టర్ చక్రవర్తి (1964) - మనసున మనసై, పాడమని నన్నడగవలెనా, నీవులేక వీణ, ఎవరో జ్వాలను రగిలించారు
దేశద్రోహులు (1964)
దొరికితే దొంగలు (1965)
పల్నాటి యుద్ధం (1966)
సంగీత లక్ష్మి (1966)
ఆత్మగౌరవం (1966)
చిలకా గోరింక (1966)
భక్త పోతన (1966)
మోహినీ భస్మాసుర (1966)
బాలనాగమ్మ (1966)
పూలరంగడు (1967)
భక్త ప్రహ్లాద (1967)
ముళ్ల కిరీటం (1967)
వసంతసేన (1967)
గృహలక్ష్మి (1967)
రక్తసింధూరం (1967)
బంగారు పంజరం (1968)
వీరాంజనేయ (1968)
ఆత్మీయులు (1969)
ఆదర్శ కుటుంబం (1969)
మామకు తగ్గ కోడలు (1969)
ధర్మపత్ని (1969)
చిట్టిచెల్లెలు (1970)
జైజవాన్ (1970)
దేశమంటే మనుషులోయ్ (1970)
బంగారు తల్లి (1971)
పవిత్ర బంధం (1971)
రామాలయం (1971)
అమాయకురాలు (1971)
శ్రీ వెంకటేశ్వర వైభవం (డాక్యుంటరి)(1971)
నీతి నిజాయితి (1972)
బాలభారతం (1972)
కాలం మారింది (1972) 100వ చిత్రం
నిండు కుటుంబం (1973)
నేరము శిక్ష (1973)
రామ్ రహీమ్ (1974)
జీవిత రంగం (1974)
పల్లె పడుచు (1974)
బంగారు కలలు (1974)
నిత్య సుమంగళి (1974)
జీవితాశయం (1974)
తాతమ్మ కల (1974)
చల్లని తల్లి (1975)
అన్నదమ్ముల కథ (1975)
భారతంలో ఒక అమ్మాయి (1975)
యశోద కృష్ణ (1975)
సెక్రటరీ (1976)
మనుషులంతా ఒక్కటే (1976)
ఈనాటి బంధం ఏనాటిదో (1977)
ఇదెక్కడి న్యాయం (1977)
కురుక్షేత్రం (1977)
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
ప్రేమ - పగ (1978)
రాధాకృష్ణ (1978)
కథ మారింది (1978)
లంబాడోళ్ల రాందాసు (1978)
శ్రీవినాయక విజయం (1979)
నామాల తాతయ్య (1979)
పవిత్ర ప్రేమ (1979)
ఇంద్రుడు చంద్రుడు (1980)
చుక్కల్లో చంద్రుడు(1980)
ఆదర్శవంతుడు (1980)
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం (1980)
బొమ్మల కొలువు (1980)
శ్రీ లక్ష్మీ నిలయం (1982)
భక్త ధ్రువ మార్కండేయ (1982) (భానుమతితో)
ముద్దుల మొగుడు (1983)
తాండ్ర పాపారాయుడు (1986)
అమెరికా అబ్బాయి (1987)ఆదర్శవంతుడు (1989)
*నటించిన సినిమాలు*
శ్రీకృష్ణ లీలలు (1935)
శశిరేఖా పరిణయం(1936)
మాయాబజార్ (1936)
జయప్రద (1939)
ఇల్లాలు (1940
*బిరుదులు* రాజేశ్వరరావుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 1979లో డాక్టరేటుతో పాటు కళాప్రపూర్ణ బహూకరించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్గా నియమించుకుంది. ఇదే కాలంలోనే ఈయన స్వరపరచిన అన్నమయ్య కీర్తనలను ఘంటసాల పాడాడు.
తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదును ఇచ్చి సత్కరించింది.
పెండ్యాల నాగేశ్వర రావుని ” సాలూరు రాజేశ్వర రావు గారి పై మీ అభిప్రాయం ఏమిటి ? ” అని ఎవరో ప్రశ్నిస్తే, ” ఆయనలాంటి సంగీత దర్శకుడు మళ్ళీ పుట్టబోడు ! ” అన్నా రట. తెలుగువారు ఎప్పటికీ గుర్తు పెట్టుకో తగిన ” సాలూరు రాజేశ్వర రావు ” వంటి సంగీత దర్శకుడు మరొకడు మళ్ళీ ఉండబోడేమో ! తెలుగు పాట ఉన్నంత కాలం ” రాజేశ్వర రావు ” మనందరిలో సజీవుడే..
ఆయనకు నివాళులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి