వీరు విజయవాడలో 1920/ఏప్రియల్ /13 వతేదిన వేంకట కృష్ణయ్య, అన్నపూర్ణమ్మగార్లకు జన్మించారు. అక్కడే గాంధీ మునిసిపల్ పాఠశాలలోనూ,కాకినాడలో ఎఫ్.ఏ.సి.ఆర్.కాలేజి,విజయనగరం మహరాణి కాలేజిలోనూ,పూనాలో న్యాయవాది పట్టాపుచ్చుకుని న్యాయవాదిగా వృత్తి కొనసాగాస్తూనే మరోపక్క నాటకాల్లో నటిస్తూ కళాసేవలు అందించేవారు.వీరు నటనకు,ఆహార్యానికి సంభంధించిన ఎన్నో మెలకువలు తనఉపన్యాసంలో పలుమార్లు వివరించేవారు. నటశిక్షణ, రూపశిల్పం,నాటక ప్రయోగం,రంగస్ధల శాస్త్రం,వాచికాభినయం ,మేకఫ్, మూకాభినయం,రససిధ్ధాంతం,ఆంగికాభినయం,లైటింగ్,రంగస్ధల నిర్మాణం,స్వాతికాభినయం మెదలైన విషయాలపై పుస్తకాలుకూడా రాసారు.తెలుగునేలపై మొదటి ప్రేక్షకులసంఘం'నటరాజ కళామండలి' స్ధాపించారు.నాట్యసంఘం,మరియు రాఘవ కళాకేంద్రం కార్యదర్శగా సేవలు అందించారు.1950 ప్రాంతంలో విజయవాడలో సుంకర కనకారావు,కొప్పరపు సుబ్బారావు,డి.వి.సుబ్బారావు,కే.వి.ఎస్.శర్మ,నిర్మలమ్మ మోదలగు వారితోకలసి'కన్యాశుల్కం'నాటకాన్ని విజయవంతంగా పలుమార్లు ప్రదర్శించారు.అందులో అగ్నిహాత్రావధానులు పాత్రను వీరు గొప్పగా పోషించేవారు.ఇంకా 'విశ్వం పెళ్ళి'-'ఇనుప తెరలు' మొదలగు నాటకాల్లో విలక్షణమైన పాత్రలు వీరు ధరించేవారు.అనంతరం డి.వి.నరసరాజు గారు రచించి 'నాటకం' అనే నాటకంలో ఒక మూఖ్యపాత్రను పోషిస్తూ నాటకరంగంలో మంచి నటుడిగా మరింత గుర్తింపు పొందారు.ఈనాటకానికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో అనేక బహుమతులు లభించేవి.వీరు ఉత్తమ దర్శకుడిగా' అనేక నాటకాలలో బహుమతులు అందుకున్నారు. 'వరవిక్రయం'-'పెద్దమనుషులు'-'ఈనాడు'-'ఆసామి'-'శ్రీరంగనీతులు' 'ఎన్.జి.వో,నాటకం,లేపాక్షి,సంభవామి యుగేయుగే, దశమగ్రహాలు, సీతాపతి సంసారం వంటి పలు నాటకాలు వీరి నటనకు వన్నెతెచ్చాయి. విజయవాడ ఆకాశవాణి కేంద్ర ప్రారంభంనుండి వీరు మరణించేదాక అనేక నాటకాలు వినిపించేవారు.జంధ్యాల,మురళీమోహన్,సుత్తివీరభద్రరావు,సుబ్బరాయశర్మ గార్లకు నటశిక్షణ ఇచ్చారు.తెలుగు రంగస్ధల,సినిమా నటుడు విన్నకోట విజయరాం గారు వీరికుమారుడే,టెలివిజన్,సినిమా నటుడు ప్రదీప్ వీరి మనమడే!సినిమారంగంలోవీరు ప్రవేసించి తొలిసారిగా బి.యన్ రెడ్డి గారి 'బంగారుపాప'(1954) 'కన్యాశుల్కం'(1955) 'దొంగరాముడు'(1955) 'వరుడు కావాలి'(1957)'బాటసారి'(1961)'శ్రీకృష్ణ కుచేల'(1961) 'చదువుకున్న అమ్మాయిలు'(1963)'రామదాసు'(1964) 'ఇల్లాలు' (1965) 'శ్రీమతి'(1966) 'సాక్షి'(1967)' బంగారు పిచ్చుక'(1968) 'స్నేహం'(1977)'ముద్దమందారం'(1981)'మల్లెల పందిరి'(1982) 'ముగ్గురమ్మాయిల మొగుడు'(1983)(వీరి మరణానంతరం విడుదల జరిగింది) వంటి పలు చిత్రాలలో నటించారు.తన అరవై రోండో ఏట 1982/ డిసెంబర్ /21 న కళామతల్లి పదసేవకై బ్రహ్మలోకం తరలి వెళ్ళారు.
విన్నకోట రామన్ని పంతులు.(వర్ధంతి) వేదికనుండి-వెండితెరకు.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు. 9884429899.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి