పట్టుదల చిన్న కథ.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 కార్తీక్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.
అతని ఇంటి పక్కనే ఉన్న సురేష్ ఇంగ్లీష్ కాన్వెంట్ లో చదువుతాడు.
ఇద్దరూ మంచి స్నేహితులు.
సాయంత్రం స్కూల్ అయిపోగానే ఆరు బయట ప్రదేశం లో ఆటలు ఆడుకున్నారు. సురేష్ వాళ్ళ అమ్మ సురేష్ ని పిలిచి నీకు కార్తీక తో స్నేహం ఏమిటి వాడు చదివేది ప్రభుత్వ పాఠశాల నువ్వెక్కడ వాడు ఎక్కడ ఇద్దరికీ స్నేహమా నీకు కావాలంటే మీ కాన్వెంట్లో పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్లతో స్నేహం చేయమంది.
సురేష్ వాళ్ళ అమ్మ అన్న మాటలు వినగానే కార్తీక్ కి కోపం వచ్చింది ఎలాగైనా సరే ప్రభుత్వ పాఠశాల లో చదువుకున్న అంతమాత్రాన స్నేహానికి పనికిరాడా అది చదువు కాదా ఆ స్కూల్లో చదువుకుంటే మంచి మార్కులు రావా అనుకున్నాడు. ఏదైనా సరే సురేష్ ని మించి మంచి మార్కులు సంపాదించాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కూడా సంపాదించాలి అని పట్టుదలతో కష్టపడి రాత్రి పగలు చదివేవాడు. టెన్త్ క్లాస్ పూర్తిచేశాడు సురేష్ అంతంతమాత్రంగా మార్పులతో పాస్ అయ్యాడు. కార్తీక్ ఫస్ట్ ర్యాంకు వచ్చింది సురేష్ వాళ్ళ అమ్మ చూసి నేర్చుకో ప్రభుత్వ పాఠశాలలో అయినా మంచి మార్కులు తెచ్చుకున్నాడు నువ్వు చూడు తక్కువ మార్కులు ఉన్నావు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఆటల తోనే తాళం గడిపేస్తావు మంచి మార్కులు వస్తేనే కాలేజీలో చేర్చుకుంటారు. అన్నది. ఇద్దరూ కాలేజీలో చేరారు డిగ్రీ తర్వాత సురేషు కలెక్టర్ అవ్వాలను కొన్నాడు.
చదువు మీద పెట్టలేదు జులాయిగా తిరిగే వాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు కార్తీక్ మాత్రం అమ్మానాన్నలు కష్టపడి చదివించారు. పట్టుదల కృషి తో సాధించి కలెక్టర్ అయ్యాడు. సురేషు చదువు మానేసి చిన్న ఉద్యోగంలో చేరాడు. ఒకసారి ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు కార్తీక్ కలెక్టర్ అయ్యాడంటే సురేష్ తల్లిదండ్రులు తన కొడుకు చదువు అబ్బ లేదని వాన పడ్డారు. కార్తీక్ ను చూసి నేర్చుకో ప్రభుత్వ పాఠశాలలో చదివినా నా మంచి మార్కులు తెచ్చుకొని కలెక్టర్ అయ్యాడు అంటూ కార్తీక్ ని పొగిడింది. స్నేహితుడు కలెక్టర్ అయినందుకు మీకు గర్భం గా ఉండదా. ఒకసారి మన ఇంటికి భోజనాలకి పిలవమంది. కార్తీక్ కలెక్టర్ హోదాలో కారులో వచ్చాడు. కుటుంబ సభ్యులంతా లేచి నిలబడి నమస్కారం చేశారు. మీలాంటి గొప్ప వాళ్ళు మా ఇంటికి రావడం నా అదృష్టం అన్నారు. సురేష్ నాకు ఒక మంచి స్నేహితుడు మేమిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉంటాను అన్నాడు కార్తిక్. ఏ స్కూల్లో చదివామన్నదే ముఖ్యం కాదు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి గొప్ప గొప్ప కాన్వెంట్లో చదివినంత మాత్రాన ర్యాంకులు సాధించలేరు. వీధిబడి అనే ప్రభుత్వ పాఠశాలను చిన్నచూపు చూడకూడదు. నేను వీధి బడిలోనే చదువుకొని ఇంత వాడిని అయ్యాను. మనలో పట్టుదల ఉంటే ఎక్కడ చదువుకున్నా మనం సాధించలేనిది ఏది ఉండదు. మనలో పట్టుదల ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం చదువుకు కార్పొరేట్ స్కూల్ నే ప్రభుత్వ పాఠశాలలోనే భేదభావం ఉండకూడదు
. మనదేశ నాయకులంతా వీధి బడిలోనే చదువుకొని ఉద్యమాలు సాధించలేదా ఎందరో మహనీయులు వీధి బడిలోనే చదువుకొని గొప్పవారు అయ్యారు. వీధి బడిలో చదువుకున్న మనలో అక్షర జ్ఞానం ఉంటే పట్టుదల పెరుగుతుంది. కార్తీక్ చెప్పిన విషయాలు విని సురేష్ తల్లిదండ్రులు మీరు చెప్పింది నిజమే చదువుకున్నారని మిమ్మల్ని చిన్న చూపు చూసి స్నేహాన్ని దూరం పెట్టాము. మీరన్నట్లు ఎక్కడ చదువుకున్నా మనలో పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చు అన్నారు సురేష్ తల్లిదండ్రులు. తన స్నేహితుడు కార్తీక్ కలెక్టర్ అయినందుకు గర్వపడ్డ సురేష్
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Nice story concept....👌👌