,డా.భానుమతిరామకృష్ణ-పద్యాంజలి"!!!: -"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్-తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.

కం.
"నటి,గాయనిగా,కవిగా"
"పటుతరముగనందులోనప్రతిభనుపొందెన్"
"అటుసంగీతమునేర్చియు"
"నిటునిర్మాతగవెలింగెనీభానుమతిన్"!!!

02.
కం.
"బహుముఖప్రజ్ఞాశాలిగ"
సహనముతోముందుకెళ్ళిసాధించెనుగా
సెహబాసనియశమునుతా
నహరహమునునందుకొనెనునాశ్చర్యముగన్!!!

03.
ఆ.వె.
"అత్తగారికథలు"నద్భుతంబుగవ్రాసి
తెలుగుభాషసేవసలిపితాను
కలుపుగోలుతనముకలిగించిమేలెంచి
భానుమతియెవైభవమునుచాటె!!!

04.
తే.గీ.
"స్టూడియోఅధినేత్రి"యైసుందరముగ
"నటనవైదుష్యమునుజూపినవ్యరీతి"
"పలుసినీమాలందీసియువిలువనొందె"
"అమ్మభానుమతికినేనుఅంజలిడుదు"!!!

05.
తే.గీ.
"కంఠమందునమాధుర్యగమకితంబు"
"పాటవినినంతమనసునుమీటుచుండు"
"మాటలాడినగుండెలోమధువులొలుకు"
"సుగుణవతి"భానుమతి"వాణిస్తుతినిజేసె"!!!

కామెంట్‌లు