మా కళలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  మనం కొందరి కళలు చూసినపుడు మనకు స్ఫూర్తి కలిగి మనం కూడా అటువంటి కళ సృష్టించాలని కలలు కంటాము.
         కొందరు ఒక దీక్షతో ఆస్ఫూర్తి నుండి పొందిన కళను ఒక తపస్సుగా కృషి చేసి పరిణితి సాధిస్తారు!
కొందరు ఎన్నో కారణాల వలన మధ్యలో వదలి వేస్తుంటారు.
       నేను చిన్నప్పుడు నెల్లూరు ఆంజనేయ స్వామి గుడిలో(సంతపేట) ఒక పెయింటింగ్ చూసి స్ఫూర్తి పొంది,ఓ నలభై డ్రాయింగ్ లు పెయింటింగులు వేశాను.కథలు,వ్యాసాలు విపరీతంగా చదవటంవలన 1977నుండి వ్రాయ గలుగుతున్నాను.నా కథలు, వ్యాసాలు సుమారు 250 ప్రచురింపబడ్డాయి.ఒకరోజు వ్రాయకపోతే ఆరోజు నన్ను నీరసం ఆవహిస్తుంది!
        నా చిన్నతనంలో నెల్లూరులో శరత్ బాబు అనే ఫ్రెండ్ ఇంటికి వెళితే వాళ్ళ నాన్న బోలెడు 'చందమామ'లు బైండ్ చేయించి పెట్టి ఉన్నాడు.ఆ స్ఫూర్తితో నేను ఉద్యోగంలో చేరాక చందమామలు కొని బైండ్ చేయించి నాలైబ్రరీలో పెట్టాను.
అక్కడక్కడా వేరే చిత్రకారులు వేసిన నాలుగు పెయింటింగులు కొని నా సేకరణలో ఉంచాను.
      డబ్బు పోతే సంపాదించవచ్చు.కాని మనకు ఇష్టమైన పుస్తకమో,పెయింటింగో మనం సేకరించలేక పోతే ఇక ఎప్పటికీ సంపాదించలేమని నా అభిప్రాయం.
         నేన ఆరో తరగతిలో ఉన్నప్పుడు నా క్లాస్మేట్ సీతాపతి ఇంటికి వెళ్ళేవాడిని,వాడి ఇంటి పక్కనే  వాసుదేవరావనే పెద్దాయన ఉండేవాడు, .అప్పుడే ఆయన దగ్గర 'రీడర్స్ డైజస్ట్'  పుస్తకాలు చూశాను.అవి అత్యధ్బుతమైనవి.ఆ స్ఫూర్తితోనే 1978 నుండి నేను ఆ పత్రికకు చందాదారుణ్ణి!
       మా మేనమామ దగ్గర అప్పటిలో కొన్ని పోస్టల్ స్టాంపులు ఉండేవి.ఆ స్ఫూర్తితోనేను బోలెడు స్టాంపులు సేకరించాను.
      ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.మా తిరుపతి తమ్ముడు ద్వారక BFA అత్యధ్బుత చిత్రకారుడు.అధ్బుత కవితలు,బాల సాహిత్యం వ్రాస్తుంటాడు.వాడికి స్ఫూర్తి వడ్డాది పాపయ్య.
        ఈ కరోనా సమయంలో మా విజయవాడ తమ్ముడు రవీంద్రనాథ్ బోన్సాయ్ పెంపకం,లాండ్ స్కేప్ పెయింటింగ్స్ వేస్తున్నాడు.వాడికి స్ఫూర్తి యు-ట్యూబ్.
        మా నెల్లూరు చెల్లెలు అనూరాధ బోలెడు కవితలు,కథలు వ్రాస్తున్నది.విశేషమేమిటంటే ఆ విధంగా వ్రాయడానికి స్ఫూర్తి  నేనే అని చెబుతుంది.
దాని అభిమానానికి కృతజ్ఞతలు.
       మా అమ్మాయి , అల్లుడు,  వేణుమాధవ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు స్ఫూర్తితో ఇద్దరూ అధ్బుతమైన పెన్సిల్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు.
       అన్నీ బాగున్నాయి కానీ తెలిసిన కొంతమంది ఇళ్ళు,స్థళాలు కొన్నారు కానీ నేను మటుకు ఏ కారణం చేతనో  ఆస్థుల విషయంలో వెనకబడిపోయాను.
        ఇదండీ స్ఫూర్తి సంగతులు.
                 *************
మా ఆఖరి తమ్ముడు రాజా...హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడికి బోలెడు పుస్తకాలు స్ఫూర్తి.ఓ భాలల కథల పుస్తకం ప్రచురించాడు.ఆ పుస్తకంలో మా తిరుపతి తమ్ముడు ద్వారక బొమ్మలు వేశాడు.ఇప్పుడు సినిమాలకు కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాడు.

కామెంట్‌లు