పెద్దకడబూరు మండలంలోని, హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయునిగా పనిచేస్తున్న, ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త గద్వాల సోమన్నను 'మధుర కవిభూషణ' పురస్కారం వరించింది.బాలసాహిత్యంలో పలు పుస్తకాలు వ్రాసి,ముద్రించడమే కాకుండా,బాలలచే రచనలు చేయిస్తూ, 'పసి(డి) హృదయాలు ' బాలసాహిత్య వేదికను ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నారు.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ఖాతాలో మరొక అవార్డు జమ కావడం విశేషం.శ్రీ ఈర్ల సమ్మయ్య గారు రూపొందించిన మధురిమలు నూతన తెలుగు కవితాప్రక్రియలో శతాధిక గేయకవితలు లిఖించినందుకుగాను మేఘన సాహితీ కళావేదిక ,తెలంగాణ రాష్ట్రం వారు కరోనా దృష్ట్యా "మధుర కవిభూషణ" పురస్కారమును సోమన్నకు వాట్సప్ గ్రూప్ ద్వారా అందజేశారు.అవార్డు గ్రహీత గద్వాల సోమన్నను తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
" మధుర కవి భూషణ " పురస్కారంగద్వాల సోమన్నకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి