చిన్నారుల ఆటలు:-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
అమ్మ అమ్మ ఇప్పుడే వస్తా 
మిత్రులతో కలిసొస్తా
పుస్తకాలనే ఇచ్చొస్తా
గురువుకు దండం పెట్టొస్తా

గుడి లో దేవుని మొక్కుస్తా
బడిగ్రౌండులో ఆడొస్తా
చెరువు కట్టపై తిరిగొస్తా
చేపల ఆటలు చూసొస్తా


షాపింగ్ మాల్ కి పోయొస్తా 
కొత్త డిజైన్లు చూస్తా 
దానం ధర్మం చేసొస్తా
గలగల మాట్లాడొస్తా
కామెంట్‌లు