గురువు కవిత:-జెగ్గారి నిర్మలసిద్దిపేట

 నిరంతరం అభ్యాసకులుగా
బోధన పట్ల అనుకూల వైఖరితో
క్రమశిక్షణ పాటించి
విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచేది
గురువు
దుర్గుణాలను దూరం చేసి
సద్గుణాలతో సంస్కరించి
మానవ మృగాన్ని మనిషిగా చేసి
ప్రగతి మార్గాన్ని చూపించేది
గురువు
పసిడి ప్రాయములో జ్ఞాన విత్తును నాటి
ఓర్పు సహనంతో ఓనమాలు  దిద్దించి 
విద్యార్థి అనే శిలను శిల్పంగామార్చి
ఉషస్సులను పంచేది గురువు
త్రిమూర్తులంతా ఒక్కటైన రూపంగా
మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి,
విద్య అనేతీపి ఫలాలను
అందించే  తరువులే గురవులు
కులమతాల కుళ్లును తుడిచీ
మూడనమ్మకాల జాడ్యం తొలగించి
విచక్షణతోకూడిన వెలుగునింపి
విద్యార్థులకు మార్గదర్శకులై వెలిగేవారు గురువులు
కామెంట్‌లు