1.గురువు పరువు చిరునామా!
తన విజ్ఞానాస్తి మనకే,
వ్రాస్తాడు వీలునామా!
జీవితాంతం సమాజాన,
"మాజి" కాక "జీ" అతడే!
బోధన లో "రాజీ" పడని,
రేడు అతనొక్కడే!
2.వరుసలో మూడవవాడు!
మా"నవ" జాతి సార్థకత,
తెచ్చే ముఖ్యుడతడే!
మనిషి లో దాగిన దైవాంశ!
వెలికి తీసి వృద్ధి పరుస్తాడు!
3.జాతిఎదుగుదల బీజాలు,
బాలబాలికలే!
వాటిని విత్తి, సంరక్షించి,
అందించే కృషీవలుడు!
సకలశ్రేయోవిద్యావాటిక,
తోటమాలి!
కళ్ళముందు సంచరించే,
వనమాలి!
4.టీచర్ ఫ్యూచర్ క్రియేటర్!
దైవమెత్తిన నవ్యజ్ఞానావతారం!
విద్య లౌకికం, ఆముష్మికం!
ఏదైనా గురుఅనుగ్రహమే!
5.ఉపాధ్యాయ మిత్రమా,
ఓ వివేకరత్నమా!
జాతికి నీపై "ఘన" నమ్మకం,
"ద్రవం" కానీకుమా!
నీ నివాసం శిష్యహృదయాలే!
నీ ఆశయం వారి సంపూర్ణ,
వ్యక్తిత్వవికాసాలే!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి