ఆటోలో భులోకంలో విహరిస్తున్న వినాయకుడి మనోగతం కందపద్యాలలో:-- సాహితీసింధు సరళగున్నాల
ముద్దుగ యెలుకనునెక్కియు
హద్దులమీరంగభువికి నరుదెంచగనే
ఒద్దికతోకనిపించగ
విద్దియ రాజెక్కెనాటొ వింతయెనిదియున్

మురుగుల కాలువ జూడగ
తరగనికాలుష్యమనుచు తరగని వ్యధతో
తెరచాటుకుతాగదులుచు
తరలించుముందుకనుచు తానాజ్ఞనిడెన్

ఎటుజూచిన ప్లాస్టిక్కుయె
మటుమాయముజేతుననుచు మరిమరి పలుకన్
అటుఇటు జనులను గాంచిన
కటువాయెను గుండెకాస్త కరుణించగనే

ఛోదక నెమ్మదినెమ్మది
ఏదైననుజరుగవచ్చు నివ్విధినడుపన్
ముదముగజెప్పితివినను
పదిలముగాకొంపకేగి బాగుగనుందువ్

పెద్దలునుడివిన పలుకులు
చద్దన్నపు మూటలయ్య జడమతిగాకన్
సుద్దలువినినను బాగుగ
మిద్దెలలోనుండుబ్రతుకు మీచెంతగనన్


కామెంట్‌లు