శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారు --విజయనగరం , ఆంధ్ర రాష్ట్రం;- పరికల్పన : రామానుజం. ప

 సీస  పద్యం  :
ఉత్తరాంధ్రనగల   ఉన్నత  పట్టణం
      విజయనగర మందు  వెలసి యున్న,
శ్రీ పైడిమాంబ      మహీపతుల  బిడ్డ ,
        నగరాన  యిలవేల్పు  నయము గాను  ;
తల్లి  దీవెనలతో     తప్పక  ప్రతియేట ,
         ఉత్సవమ్ము   జరుగు   ఊరు వాడ ;
సిరిమాను  సిద్ధమై   తిరువీధి  పయనించి,
        కనుల విందునుచేస్తు  కాచు చుండు  ;
తేటగీతి   :
పెక్కు  ప్రాంతాల  ప్రజలొచ్చి వేడు కొనగ ,
మ్రొక్కు కున్న వారల జూచు మురిపముగను,
కోట  ప్రాంగణం  ముమ్మారు  కోరి  వచ్చి  ...
కన్న  వారల  దీవించి   గౌర వించు    !!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
  
కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది 🙏🙏🙏