స్వార్థం;-విష్ణు ప్రియ;-కలంస్నేహం
అనంతమైన ఆకాశంలో...
ఊయలలూగే మబ్బుల తేరులు...
మబ్బులమాటున దాగిన మెరుపుతీగలు...
రాతిరిలో మిలమిల మెరిసే తారలు...
తరాల మధ్య మబ్బులతో దోబూచులాడే జాబిలి...

ఎంత అందం ఈ సృష్టి!!
అణువణువునా ప్రకృతి రమణీయత!!
ఎన్నెన్ని రంగులో!
ఎన్నెన్ని పూవులో!
ఎన్నెన్ని పక్షులో!!!
ఎన్నెన్ని సహజ వనరులో!!
ఈ అవనిపై....
హరితవర్ణంలో సస్యశ్యామలమై...
సమృద్ధిగా పండు పాడిపంటలు
గలగలపారే సెలయేళ్ళు..
సెలయేళ్లపై ఎగిరే పక్షులవిన్యాసాలు...
ఎత్తయిన కొండలు
కొండల మాటున దాగిన ఉషోదయపు భానుడు..
ఎంతచూసినా తనివి తీరని అందం...

నేడు నిష్కర్షగా మానవుడు చేసే..
స్వార్థ పూరిత పనులతో....
కొండలు కరిగిపోయి...
తరువులు తరిగిపోయి...
సెలయేళ్ళు ఎండిపోయి...
హరితవనాలు అంతమైపోయి..
నిర్మానుష్యమై మిగిలిపోనున్నదా...ఈ అవని??


కామెంట్‌లు