"తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి కాదంబరి శ్రీనివాసరావు"
 ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక "ఆజాదీకా అమృత మహోత్సవ్" ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా "అంతర్జాతీయ గేయ కవితల పోటీలు" నిర్వహించింది. 

ఈ పోటీలో  అనకాపల్లి జిల్లా, తిమ్మాపురం గ్రామవాస్తవ్యుడైన శ్రీ. కాదంబరి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. మే, 28 తేదీన జూమ్ లో    తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి వేదిక మీద శ్రీనివాసరావు  తమ  జానపదగేయాన్ని పాడి  వినిపించబోతున్నారు.
ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు 
తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, 
తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 
అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే 
ఈ "తానా గేయ తరంగాలు " కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. "యప్ టీవీ" ద్వారా అమెరికాతో  పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 
ఈ టీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది. 
సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే శ్రీనివాసరావు గారు ఇంతకుముందు పలు సాహితీ సంస్థలనుండి బిరుదులు పొందియున్నారు. వృత్తి రీత్యా వీరు గుర్రాజుపేట యూ.పి. పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు. గతంలో మండల మరియు జిల్లా  స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు గా అవార్డులు పొంది,ప్రముఖులతో ప్రసంశలు అందుకున్నారు. 

ఈరోజు తిమ్మాపురం  ఖ్యాతిని  ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన శ్రీనివాసరావును తెలుగు వెలుగు సాహిత్య వేదిక, అనకాపల్లి సాహితీ మిత్రులు, ఉదయసాహితీ సాహితీ సంస్థలు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.కె.ఎల్.ఎన్. ధర్మారావుగారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Good and eminent teacher..He is a social reformer..